Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి నంద్యాల, కాకినాడ ఎన్నికలే నాంది కావాలి: జగన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కాకినాడలో విమర్శలు గుప్పించారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీలు అమలు చేయని వారికి ఓటుత

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (16:33 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కాకినాడలో విమర్శలు గుప్పించారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీలు అమలు చేయని వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. రాబోయే కురక్షేత్ర సంగ్రామానికి నంద్యాల, కాకినాడలే నాంది కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?  పొదుపు మహిళలను బాబు దారుణంగా మోసం చేశారని జగన్‌ ధ్వజమెత్తారు.
 
 జాబుల విషయంలోనూ ఇంతే జరిగిందన్నారు. గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని తెలిపారు. పేద పిల్లల ఉన్నత చదువు కోసం మహానేత వైఎస్‌ఆర్‌ ఫీజు రియంబర్స్‌‌ను అమలు చేస్తే, ఈ ప్రభుత్వం దానిని నీరుగార్చేసింది. ఆరోగ్యశ్రీ, 108లను నిర్విర్యం చేసేశారు. అందుకే హామీలు అమలు చేయని వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని ప్రజలను కోరిన వైఎస్‌ జగన్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments