Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ చేనేత దినోత్సవం: ఏపీలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (08:43 IST)
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీలో చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించే 'నేతన్న నేస్తం' మూడో విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ నెల 10న ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న కార్మికులకు(ఒక్కొక్కరికి) రూ.24 వేలు ఇస్తారు. వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తారు. 
 
పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేసేందుకు శనివారం నుంచి మూడు రోజులపాటు ప్రచారాన్ని నిర్వహించాలని గ్రామ, వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్మికులు స్థానికంగా చేనేత సంఘంలో రిజిస్టర్‌ అయి ఉన్నారా, లేదా అనే విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది.
 
నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్ గానే పరిగణిస్తారు. 
 
దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments