Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ అక్రమాస్తుల కేసు : ఇన్‌ కెమెరా ప్రొసీడింగ్స్‌కు ఆదేశం... కష్టాలు తప్పవా?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (11:30 IST)
వైకాపా అధినేత, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా, శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఈ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు. అలాగే, ఏ2గా ఉన్న వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావులు కూడా హాజరయ్యారు. 
 
అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా నాంపల్లి సీబీఐ కోర్టు జగన్మోహన్ రెడ్డికి తేరుకోలేని షాకిచ్చింది. ఈ కేసు విచారణను ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌కు న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో కేసులోని నిందితులతో వారి తరపు న్యాయవాదులు కూడా ఒకింత షాక్‌కు గురయ్యారు.
 
నిజానికి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కేవలం కొన్ని రకాల కేసులకు మాత్రమే అనుమతిస్తారు. అత్యాచారానికి సంబంధించిన కేసులు, దేశ భద్రతకు, రాజ్యాంగానికి సంబంధించిన కేసులను మాత్రమే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌కు అనుమతిస్తారు. 
 
అయితే, జగన్ అక్రమాస్తుల కేసులో అత్యంత కీలకం కావడంతో పాటు ప్రజాప్రయోజనాలకు, అక్రమ ఆదాయాల, కోట్లాది రూపాయల ఆర్థిక ప్రయోజనాలు, భిన్న కంపెనీల లావాదేవీలు తదితర అంశాలతో ముడిపడివుండటం వల్లే న్యాయమూర్తి ఈ తరహా ప్రొసీడింగ్స్‌కు ఆదేశించివుంటారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments