Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కటౌట్‌కు నిప్పు...

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (13:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. అనేక ప్రాంతాల్లో వైకాపా ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కటౌట్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్థరాత్రి సమయంలో ఈ పనికి పాల్పడ్డారు. దీంతో ముఖ్యమంత్రి కటౌట్ సగం మేరకు కాలిపోయింది. 
 
మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ కటౌట్‌ను వైకాపా శ్రేణులు ఏర్పాటు చేశారు. కటౌన్‌ను దగ్ధం చేయడంపై వైకాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
మరోవైపు, ఈ కటౌట్ దగ్ధం వార్త తెలుసుకున్న బందరు డీఎస్పీ బాషా, పెడన సీఐ ప్రసన్న గౌడ, గూడూరు ఎస్ఐ వెంకట్ ఘనటా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెడనలో చేనేత కార్మికులకు చేయూత పథకాన్ని ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా జగన్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆర్థిక సంఘం డైరెక్టర్ కారుమంచి కామేశ్వర రావు మాట్లాడుతూ, జగన్ కటౌట్‌ను కాల్చివేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రాజకీయాల్లో అనేక కొడవలు ఉంటాయని, కానీ కటౌట్లకు నిప్పు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments