Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడులో ప్రపంచ శ్రేణి స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన ఐటీసీ

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (22:42 IST)
భారతీయ బహుళజాతి సంస్ధ ఐటీసీ లిమిటెడ్‌ నేడు తమ అంతర్జాతీయంగా ప్రామాణీకరించబడిన స్పైసెస్‌ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు వద్ద ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ శ్రీ సంజీవ్‌ పురితో పాటుగా ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.
 
ఈ అత్యాధునిక కేంద్రంలో పసుపు, మిరప, మిశ్రిత మసాలాల కోసం ప్రత్యేక ప్రాసెసింగ్‌ లైన్స్‌ ఉన్నాయి. ఈ కేంద్ర వార్షిక సామర్ధ్యం 20,400 మెట్రిక్‌ టన్నుల స్పైసెస్‌. దీనికి 15కు పైగా ఆర్గానిక్‌ స్పైసెస్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది. ఇది అంతర్జాతీయంగా ఐటీసీ యొక్క ఆహార ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఎగుమతి చేసే సామర్ధ్యం కలిగి ఉంది. యూరోప్‌, యుఎస్‌, కెనడా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాలను ఇది లక్ష్యంగా చేసుకుంది.
 
ప్రపంచశ్రేణి మేక్‌ ఇన్‌ ఇండియా ప్లాంట్‌ ఇప్పుడు అన్ని ప్రాసెసింగ్‌ అవసరాలనూ తీర్చనుంది. దీనిలో స్టోరేజీ, క్లీనింగ్‌, ప్రాసెసింగ్‌, స్టెరిలైజేషన్‌, ప్యాకింగ్‌, క్వాలిటీ టెస్టింగ్‌  వంటివి కూడా అందుబాటులో ఉండటం వల్ల నాణ్యతకు పూర్తి భరోసా అందిస్తుంది. ఈ యూనిట్‌లో సస్టెయినబల్‌ స్పైసెస్‌వాల్యూ చైన్‌ సైతం ఉండటం వల్ల, ట్రేసబిలిటీ నిర్దారించే బలమైన పంట అభివృద్ధి కార్యక్రమం ద్వారా రైతులకు మద్దతునిస్తుంది. దాదాపు 5500కు పైగా రైతు కుటుంబాలు, 2200కు పైగా లైవ్లీహుడ్స్‌కు ఈ వాల్యూ చైన్‌ వ్యాప్తంగా మద్దతునందిస్తారు. ఈ సదుపాయానికి హైటెక్‌ ఎనర్జీ ఎఫీషియెంట్‌ ఎక్విన్‌మెంట్‌ మద్దతు అందిస్తుంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెల్స్‌ ఉండటం వల్ల స్వచ్ఛ విద్యుత్‌ వినియోగానికి భరోసా కలుగుతుంది. ఈ యూనిట్‌లో అధిక శాతం మహిళలు పనిచేస్తారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేంద్రం ప్రారంభించడం గురించి ఐటీసీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ శ్రీ సంజీవ్‌ పురి మాట్లాడుతూ, ‘‘రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధలోని మూడు కీలక రంగాలైన వ్యవసాయం, తయారీ మరియు సేవల రంగంలో మా కార్యకలాపాలను బలోపేతం చేయాలనే నిబద్ధతకు అనుగుణంగా మేము పల్నాడులో ప్రపంచశ్రేణి, ఎగుమతుల లక్ష్యంగా స్పైసెస్‌ సదుపాయం ప్రారంభించాము. అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకనుగుణంగా అత్యున్నత నాణ్యత కలిగిన స్పైసెస్‌ను అందించడంతో పాటుగా స్థానిక వ్యవసాయ విలువ చైన్‌కూ తోడ్పాటునందించనున్నాము.
 
సస్టెయినబిలిటీ, ఇన్‌క్లూజన్‌కు ప్రతీకగా ఈ యూనిట్‌ నిలువనుండటంతో పాటుగా ఈ యూనిట్‌లోని సమగ్రమైన కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయం మెరుగుపరచడం, మహిళాసాధికారిత వృద్ది చేయడం, పెద్ద మొత్తంలో జీవనోపాధికి  మద్దతు అందించడం, పునరుత్పాదక విద్యుత్‌ను విస్తృతంగా వినియోగించడం చేయనుంది. వేగవంతంగా సామాజిక-ఆర్థిక మార్పును చేరుకోవాలనే గౌరవనీయ ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా మేము ఆంధ్రప్రదేశ్‌లో బహుముఖ  కార్యక్రమాలను రాష్ట్ర ఉద్యానవన శాఖతో కలిసి ప్రారంభించాము. తద్వారా మిర్చీ సేకరణ పరంగా రాష్ట్రాన్ని అంతర్జాతీయ కేంద్రంగా మార్చనున్నాము. దీనితో  పాటుగా తయారీ, ఆతిథ్య రంగాలలో మా కార్యకలాపాలు విస్తరిస్తూనే భారీస్ధాయి సామాజిక పెట్టుబడుల కార్యక్రమాలలో కూడా కార్యకలాపాలు ప్రారంభించనున్నాము’’అని అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌తో దశాబ్దాల భాగస్వామ్యం కలిగిన ఐటీసీ తమ కార్యకలాపాలను రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధలో అత్యంత కీలకమైన వ్యవసాయం, తయారీ, సేవల రంగాలలో నిర్వహిస్తోంది. ఈ కంపెనీ యొక్క విస్తృత శ్రేణి వ్యవసాయ-వ్యాపార ఉనికి రాష్ట్రంలో మసాలాలు, వరి, ఆక్వా, పండ్లు, పల్ప్‌ఉడ్‌ వంటి వ్యాప్తంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments