Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు ఎమ్మెల్యే ఇంట్లో నోట్ల కట్టలే కట్టలే... అక్రమ ఆస్తులు రూ.284 కోట్లు...!

చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతోంది. ఈనెల 23,24 తేదీలలో ఇప్పటికే చిత్తూరులో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (12:29 IST)
చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతోంది. ఈనెల 23,24 తేదీలలో ఇప్పటికే చిత్తూరులో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, కర్ణాటర రాష్ట్రాల్లో దాడులు కొనసాగాయి. అయితే పరిశ్రమలకు సంబంధించిన లావాదేవీలను మాత్రమే ఇప్పటి వరకు అధికారులు స్వాధీనం చేసుకోగా నిన్న జరిగిన దాడుల్లో 284కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
 
బెంగుళూరు వైట్‌ ఫీల్డ్‌లోని వైదేహి ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్ రీసర్చ్ సెంటర్‌పై దాడి చేయగా కళాశాలలో 50 కోట్ల రూపాయలు బయటపడింది.  ఈ డబ్బు మొత్తం అక్రమంగా సంపాందించిందని ఐటీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆ  మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా 234 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
 
బెంగుళూరులో పట్టుకున్న డబ్బును తరలించడానికి ఒక పెద్ద ట్రక్‌ను ఐటీ అధికారులు తీసుకురావాల్సి వచ్చిందట. దేశ చరిత్రలో రెండవసారి ఇంత పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు డబ్బును స్వాధీనం చేసుకున్నారట. గతంలో పాండిచ్చేరిలోని రాయచూర్‌ సమీపంలో ఉన్న ఒక వైద్య కళాశాలలో దాడులు చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు 19.5 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారట. 
 
డి.కె.కుటుంబంలో పెద్ద కుమారుడు శ్రీనివాసులుతో పాటు ఆయన పెద్ద కుమార్తె తేజశ్రీ, చిన్న కుమార్తె కల్పజాలు వ్యాపార లావాదేవీలను చూస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొన్ని రోజుల పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments