Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోను తలదన్నేలా ఎయిర్‌టెల్ ఆఫర్‌.. ఐఎస్‌డి కాల్స్ ఉచితం

రిలయన్స్ జీయోను తలదన్నేలా ఎయిర్‌టెల్ సంస్థ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (11:51 IST)
రిలయన్స్ జీయోను తలదన్నేలా ఎయిర్‌టెల్ సంస్థ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఆఫర్ కింద అంతర్జాతీయంగా అన్ని ఇన్‌కమింగ్స్ కాల్స్ ఇక ఉచితంగా అవుతాయి. అలాగే ఎయిర్‌టెల్ నెంబరును ఏ దేశంలోనైనా వాడుకునే అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమవుతోంది.
 
ఎక్కువ కాల్ చార్జీ, డేటా రీచార్జీలపై ఆందోళన అవసరం లేదని ఈ ప్యాక్ పోస్టు పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగారులందరికీ వస్తుందని ఎయిర్‌టెల్ పేర్కొంది. అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్ ఆఫర్ కింద ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, భారత్‌కు ఉచితంగా మెసేజ్‌లు చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు అన్ని ప్రముఖ దేశాల నుంచి ఇండియాకు ఉచితంగా కాల్స్ చేసుకోవడంతోపాటు డేటా ప్రయోజనాలు కూడా అందిస్తామని పేర్కొంది. 
 
ఈ ప్యాక్ కాల వ్యవధి 30 రోజులుగా నిర్ణయించింది. అయితే, విదేశాల్లో ఒక్క రోజు గడిపేవారు వన్‌డే ప్లాన్ కింద 10 డాలర్లు (రూ.649) చెల్లించాలని, నెలకు అయితే 30 రోజుల ప్యాక్ కింద 75 డాలర్లు (రూ.4,999) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 3జీ డేటా, అపరిమిత ఇన్‌కమింగ్ కాల్స్, భారత్‌కు కాల్స్ చేసుకునేందుకు 400 ఉచిత నిమిషాలు, భారత్‌కు అపరిమితంగా మెసేజ్‌లు చేసుకునే వెసులుబాటు ఈ ఆఫర్‌లో ప్రకటించనుంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments