Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో ప్రయాణం... వాటర్ క్యాన్‌లో లక్షల సొమ్ము..

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:49 IST)
రోజూ పాత స్కూటర్‌పై రైల్వే స్టేషన్‌కు వెళ్తూ, అక్కడి నుండి రైలులో అనకాపల్లిలోని తన కార్యాలయానికి వెళ్లే ఒక ఉద్యోగి కూడబెట్టిన ఆస్తుల వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. భూములు, భవనాలు, బంగారం, వెండి, నగదు, ఇలా గురువారం అధికారులు జరిపిన ఐటి దాడులలో చిక్కిన అవినీతి అధికారి అక్రమార్జన అంతులేకుండా పోయింది.
 
అనకాపల్లిలో భూగర్భశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న గుండు శివాజీ 1993లో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరి, తర్వాత పదోన్నతులు పొంది ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలో భారీగా భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాల రూపంలో అక్రమాస్తులు కలిగి ఉన్నాడు. ఇతని గురించి ఫిర్యాదులు అందుకున్న ఐటీ విభాగం ఆరు నెలల నుండి నిఘా ఉంచి, గురువారం నాడు ఏడు బృందాలుగా విడిపోయి ఏక కాలంలో ఏడు చోట్ల ఐటీ సోదాలు నిర్వహించారు.
 
శివాజీ ఇంట్లో 240 గ్రాముల బంగారం, 3.3 కిలోల వెండి, 10 లక్షల రూపాయలు ఉన్నట్లు కనిపెట్టారు. వాటర్‌ క్యాన్‌లో సుమారు 10 లక్షలు పెట్టి, తన బెడ్రూంలో ఉంచుకున్నాడు గుండు శివాజీ. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు లెక్కగట్టినా వీటి విలువ 50 కోట్లకు పైమాటేనని ఏసీబీ అధికారులే చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments