Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేనా రాజన్న రాజ్యం?: చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (05:38 IST)
వైద్య విద్యార్థిపై డీసీపీ చేయిచేసుకోవడాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళన చేపట్టినా వైసీపీ ప్రభుత్వం అసహనానికి గురవుతోందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ఎన్ఎమ్‌సి బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్‌ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇదేనా రాజన్న రాజ్యం.. ప్రజల గొంతునొక్కే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు.

వైద్య విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ టీడీపీ ఎంపీ కేసినేని నాని కూడా ట్వీట్ చేశారు. ‘‘సీఎంగారూ.. మీ పాలనలో సమస్యలపై శాంతియుతంగా ధర్నా చేస్తే.. పోలీసులతో కొట్టిస్తారా?" అంటూ ప్రశ్నించారు. "రాష్ట్రంలో రౌడీరాజ్యం, ఫ్యాక్షన్‌ రాజ్యం.. పోలీసు రాజ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించవద్దు’’ అని కేశినేని నాని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments