Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమ్యూనిస్టులతో పవన్ ప్రయాణం లాభాన్నిస్తుందా...!

సినీనటులు రాజకీయాల్లోకి రావడం కొత్తమే కాదు. దివంగత నేత నందమూరి తారకరామారావు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ రాజకీయాలను ఒంట పట్టించుకున్న వారే. సినీరంగంలో కాస్త పేరు వస్తే చాలు ఇక రాజకీయాల్లోకి వచ్చి

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (12:34 IST)
సినీనటులు రాజకీయాల్లోకి రావడం కొత్తమే కాదు. దివంగత నేత నందమూరి తారకరామారావు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ రాజకీయాలను ఒంట పట్టించుకున్న వారే. సినీరంగంలో కాస్త పేరు వస్తే చాలు ఇక రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలన్న తపన వచ్చేస్తోంది. ఇదే కోవలో మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత ప్రజల్లో చతికిలపడి చివరకు పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి కలిపేసి ప్రస్తుతం సైలెంట్ ఉంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉన్నారు. 
 
151వ సినిమా తీసుకుంటే రాజకీయ ఇంటర్వ్యూ అంటేనే మీడియా ప్రతినిధులకు దణ్ణం పెట్టేస్తున్నారు. అయితే చిరంజీవి దారిలోనే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ నడుస్తున్నారట. వీరిద్దరికి వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేకున్నా అటు సినీరంగంలోను, ఇటు రాజకీయరంగంలోను ఎవరి వారు ఎలాంటి సలహాలు ఇచ్చుకోరు. ఎందుకుంటే ఎవరి దారి వారిద్దన్నమాట. ఒకరి మాట మరొకరు వినరు. అందుకే రాజకీయాల్లో ఎవరికి వారు ఒక్కో దిక్కులో ఉన్నారు. వీరిద్దరిలో పవన్ కళ్యాణ్‌దే ప్రస్తుతం హాట్ టాపిక్. 
 
రాజకీయ పార్టీ పెట్టినా పోటీ మాత్రం ఇంతవరకు చేయలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తానని పవన్ స్వయంగా ప్రకటించాడు. దీంతో జనసేనలోకి వెళ్ళాలని చిన్న చిన్న పార్టీలు ఉవ్విళ్ళూరుతున్నాయి. జనసేనలోకి వెళితే అధికారం ఖాయమన్నది వారి భావన. అయితే ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాటం చేసే కమ్యూనిస్టులు మాత్రం పవన్ ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు చూసి ఆయనతో జనకట్టేందుకు సిద్ధమవుతున్నారు. 
 
ఇప్పటికే సిపిఐ ఎపి కార్యదర్శి రామక్రిష్ణ పవన్‌తో మంతనాలు జరుపగా తాజాగా సిపిఎం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం భేటీ అయ్యారు. వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కమ్యూనిస్టులతో కలిసేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ ప్రజల వెంట ఉండే కమ్యూనిస్టులతో కలిస్తే మంచిదన్నదే ఆయన అభిప్రాయం. అయితే వీరు కలిసి ఇప్పటి నుంచే పనిచేస్తారా.. లేకుంటే ఎన్నికల్లో మాత్రమే కలుస్తారా అన్నది తేలాల్సి ఉంది.  

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments