Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌న‌సేన కార్య‌కర్త‌ల‌కు రూ.5 ల‌క్ష‌ల ఇన్స్యూరెన్స్!

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (17:23 IST)
జ‌న‌సేన కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు... ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. కార్య‌క‌ర్త‌లంద‌రికీ అయిదు లక్షల రూపాయ‌ల ఇన్సూరెన్స్ కల్పించారు ప‌వన్ కళ్యాణ్. జనసేన పార్టీలో క్రియాశీలక  సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉండాలని ఈ ప‌ని చేశారు.

దురదృష్టవ‌శాత్తు ఎవరికి అయినా ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని ప్రతి కార్యకర్త కు 5 లక్షలు రూపాయ‌లు ఇన్సూరెన్స్ చేశారు. అలాగే ప్రమాదం జరిగి హాస్పటల్లో చికిత్స పొందే వారికి ఖర్చులు నిమిత్తం 50 వేల‌ రూపాయ‌లు ఇస్తారు. గొల్లపూడి గ్రామ పంచాయతీ జనసేన పార్టీ అధ్య‌క్షుడు కె. ధర్మారావు ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ బాండ్స్‌ను మైలవరం నియోజకవర్గం ఇన్చార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహన రావు (గాంధి) చేతులు మీదుగా ఇచ్చారు.
ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి కార్యకర్త  పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల‌ని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ, అధికారంలోకి రావటానికి ప్రతి ఒకరు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ మూర్తి ఎంపీటీసీ సభ్యులు కాంతకుమారి, కిరణ్, ప్రవీన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments