Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీగోయర్స్ 52వ గోల్డెన్ జూబ్లీ అవార్డ్స్ ప్రోమో విడుదల

Advertiesment
Cinegoers 52nd Golden Jubilee Awards
, మంగళవారం, 27 జులై 2021 (13:46 IST)
Cinegoer awads logo
1970 నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతోమంది గొప్ప నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సినీగోయర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకరమైన "సినీగోయర్స్ అవార్డు"తో గౌరవించి సత్కరిస్తున్నారు. తాజాగా 2019 - 20 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు  సినీ గోయర్స్ అవార్డుతో నటీనటులను, సాంకేతిక నిపుణులను సత్కరించాలని సన్నాహాలను చేస్తున్నారు. ఆ వివరాలనే తెలియజేయటానికి హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

51 వసంతాలు పూర్తిచేసుకుని 52వ గోల్డెన్ జూబిలీ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో జనరల్ సెక్రటరీ గా వ్య‌వహరిస్తున్న బి.రామకృష్ణ ఈ 52వ అవార్డు కార్యక్రమం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు  డాక్టర్ కె వి రమణ గారు మరియు జి హెహ్ ఎమ్ సి  డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. అలాగే తెలుగు సినిమా దర్శకులు త్రినాథ రావు నక్కిన, ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ మొండిటొక అరుణ్ కుమార్ మరియు కె ఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఏం వి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.  
 
జనరల్ సెక్రటరీ బి రామకృష్ణ గారు మాట్లాడుతూ "మా నాన్న గారు ఎంతో కష్టపడి సినీ గోయర్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు ను స్థాపించారు. ఇప్పడు గోల్డెన్ జూబ్లీలోకి అడుగు పెడుతున్నాం. ఈ 52వ అవార్డు ఫంక్షన్ ను చాలా గొప్పగా నెక్స్ట్ లెవెల్ లో నిర్వహించాలని అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ జరుపుతాం. తెలుగు చలన చిత్ర సీమ వున్నంతకాలం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాం. తెలుగులో  52 సంవత్సరాలుగా అవార్డ్స్ ఫంక్షన్  నిర్వహిస్తున్న ఏకైక సంస్థ మా సినీ గోయర్స్ అవార్డ్స్. మాకు ఎంతో సహాయసహకారాలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి నా ధన్యవాదాలు. సెప్టెంబర్ లో 52 వ అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తాం. అవార్డు క్యాటగిరీ, నామినీ లిస్ట్ ను ఆన్ లైన్ లో పొందుపరుస్తాం. ఆన్ లైన్ ద్వారానే ఓటింగ్ ఉంటుంది. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాం" అని తెలిపారు. 
 
డాక్టర్ పి శ్రీధర్ గారు మాట్లాడుతూ "ఇంతా ప్రతిష్టాకరమైన సినీ గోయర్స్ అవార్డ్స్ సంస్థ కి నన్ను ప్రెసెడెంట్ గా ఎన్నుకోవటం చాలా సంతోషంగా ఉంది. రేనోవా హాస్పిటల్స్ టైటిల్ స్పాన్సర్స్ గా ఉండటం చాలా గర్వంగా ఉంది. సినీ గోయర్స్ వారి  ఓటింగ్ ప్రక్రియ పారదర్శకతగా ఉంటుంది. సెప్టెంబర్ లో జరగబోయే మెయిన్ ఈవెంట్ మంచి విజయవంతం అవాలి" అని కోరుకున్నారు.  
 
తెలంగాణ గవర్నమెంట్ సలహాదారుడు  డాక్టర్ కె వి రమణ గారు మాట్లాడుతూ " సినీ గోయర్స్ అవార్డ్స్ తో నాకు 40సంవత్సరాల అనుబంధం ఉంది. కిషన్ గారు ఎలా అయితే అవార్డు ఫంక్షన్ కి కృషి చేసారో అలాగే వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారు కూడా కృషి చేస్తున్నారు. మన తెలుగుచలనచిత్ర పరిశ్రమలో 52 సంత్స రాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ సినీ గోయర్స్. రామకృష్ణని మరియు ఈ సినీ గోయర్స్ ని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ లో జరిగే ఫంక్షన్ అద్భుతంగా జరగాలి" అని కోరుకున్నారు. 
 
సినిమా దర్శకుడు త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ "నేను చిన్నపుడు ఒక ఆడియన్స్ గా సినీ గోయర్స్ అవార్డు వేడుకలకి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడం చాలా ఆనందంగా ఉంది. 52 సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహించడం అంటే చాలా కృషి కావాలి, మరి అంత కృషి ఉన్న రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు ఫంక్షన్ మంచి సక్సెస్ అవ్వాలి " అని కోరుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బిగ్ బీ.. రామోజీ ఫిల్మ్ సిటీలో..?