Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆటోలో అసభ్యంగా డ్రైవర్, దిశ సమాచారంతో నిమిషాల్లో కాపాడిన పోలీసులు

ఆటోలో అసభ్యంగా డ్రైవర్, దిశ సమాచారంతో నిమిషాల్లో కాపాడిన పోలీసులు
, సోమవారం, 26 జులై 2021 (17:17 IST)
ఆపదలో ఉన్న యువతిని దిశ యాప్ ద్వారా సమాచారం రావడంతో నిమిషాల వ్యవధిలో రక్షించారు పోలీసులు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు నేరాలను ఒకే ఒక్క బటన్ నొక్కి ఉక్కుపాదం మోపేలా దిశ యాప్ డెవలప్ చేసింది ఎపి ప్రభుత్వం. ఇప్పుడది సత్ఫలితాలను ఇస్తోంది.
 
సూళ్ళూరుపేట సమీపంలోని శ్రీసిటీలో పనిచేస్తున్న ఒక యువతి మార్కాపురం వెళ్ళింది. నాయుడు పేట నుంచి సూళ్ళూరుపేట వెళ్ళేందుకు రాత్రి సమయంలో ఆటో ఎక్కింది. అయితే ఆటోలో ఎక్కిన కొద్దిసేపటికే డ్రైవర్ మాటతీరు, పద్ధతిపై అనుమానం వచ్చింది. ఏ మాత్రం ఆలోచించకుండా దిశ యాప్‌లో ఎస్ఓఎస్ బటన్‌ను ఆన్ చేసింది. బాధిత యువతి ఎస్ ఓఎస్ బటన్ ఆన్ చేయగానే వెంటనే పోలీసులకు సమాచారం వెళ్ళింది.
 
రాత్రి 10.30 నిమిషాలకు సమాచారం అందుకున్న పోలీసులు 10.40 నిమిషాలకు బాధిత యువతితో  ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దొరవారి సత్రం పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది 10.42 నిమిషాలకు యువతి దగ్గరకు చేరుకున్నారు. కానీ అప్పటికే ఆటో డ్రైవర్ పరారయ్యాడు.
 
యువతిని సేఫ్ చేసిన పోలీసులు తరువాత ఆమె పనిచేసే ప్రాంతంలో వదిలిపెట్టారు. బాధిత యువతి చాలా అప్రమత్తంగా వ్యవహరించిందన్నారు పోలీసులు. ముందస్తు ఎస్ఓఎస్ బటన్ నొక్కడంతో పాటు తన సోదరికి కూడా కాల్ చేసి చెప్పిందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాము కరిచింది.. అయినా తల్లిదండ్రులు తిడతారనీ...