Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్ ను స‌న్మానించిన సీఎం జ‌గ‌న్

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (14:38 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్ ను సీఎం అభినందించారు.

 
ఈ ఏడాది డిసెంబర్‌ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించాడు. శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించిన సీఎం వైఎస్‌ జగన్, ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా  శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నాడు. 
 
 
ఈ కార్యక్రమంలో టూరిజం, క్రీడా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శాప్‌ ఎండీ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌ కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments