Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు శుభవార్త... ప్రత్యేకించి మహిళలకు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (11:35 IST)
భారత రైల్వే శాఖ ప్రయాణికులకు మరో శుభవార్త తెలియజేసింది. ప్రత్యేకించి మహిళల కోసం కొత్త వెసులుబాటు తీసుకువచ్చింది. మహిళా ప్రయాణికుల భద్రతలో భాగంగా వారి కోసం ప్రత్యేక కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మహిళలకు ఏర్పాటు చేసే ప్రత్యేకమైన బోగీలు పింక్ రంగులో ఉంటాయి. 
 
బోగీలపై పింక్ కలర్ లైన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో ప్రతి ట్రైన్‌లో ఒక కోచ్ మహిళల కోసం కేటాయించిన విషయం తెలిసిందే. మహిళల కోసం కేటాయించిన పింక్ బోగీల్లో ఆడవారు. చిన్న పిల్లలు ఎక్కొచ్చు. నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ జోన్ ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తోంది. 
 
ఎన్ఎఫ్ఆర్ దాదాపు ఆరు ప్యాసింజరర్ ట్రైన్స్ ఎల్ఎల్ఆర్ కోచ్‌లకు పింక్ రంగు వేసింది. ఈ బోగీల్లో కేవలం మహిళలు, పిల్లలు మాత్రమే ప్రయాణించాలనే నిబంధనను పెట్టారు. ఈ విషయంలో ఇండియన్ రైల్వే... మెట్రోని ఫాలో అవుతోంది.
 
 'మహిళా ప్రయాణికుల భద్రత కోసం మెట్రో దారిలోనే నడుస్తాం. వారికి ప్రత్యేకమైన బోగీలను ఎక్కువగా ఏర్పాటు చేస్తాం. వీరిలో మహిళలు, పిల్లలు మాత్రమే ప్రయాణించొచ్చు. ఎన్ఎఫ్ఆర్ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తోంది. త్వరలోనే ఇతర ట్రైన్లకు కూడా దీనిని వర్తింపజేస్తాం' అని రైల్వే శాఖ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments