కుర్రాళ్ళ కోసం సన్నీని తీసుకొచ్చింది నేనే : పూజా భట్

శనివారం, 6 అక్టోబరు 2018 (17:02 IST)
పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి సన్నీ లియోన్. ఈమెను బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎవరు పరిచయం చేశారో ఇపుడు  తెలిసింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ కుమార్తె పూజా భట్ భారత కుర్రాళ్ల కోసం సన్నీని బాలీవుడ్ వెండితెరకు పరిచయం చేసిందట.
 
ఇటీవల ఇండియా‌ టుడే నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని నటిగా తన కెరీర్ గురించీ, నిర్మాతగా, దర్శకురాలిగా తనకెదురైన పరిస్ధితులను వివరించింది. శృంగార తారగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే సన్నీని ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ‌కి తీసుకురావాలనుకున్నానని చెప్పారు. 
 
సన్నీ సాధారణ సినిమాల్లో నటించడానికి అమెరికా ఒప్పుకోలేదు.. అప్పుడు తానే ఆమెను హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయం చేసా.. ఇప్పుడు ఇక్కడ తనకంటూ ఫ్యాన్స్ ఉన్నారనీ, ఈ మాట స్వయంగా సన్నీనే తనతో చెప్పిందని పూజా తెలిపారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సన్నీ అడుగుపెట్టిందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సార్.. నాన్నగారిపై ఉన్న అభిమానంతోనే ఆస్తులమ్మి సినిమా తీశాం.. సహకరించండి...