Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

'డిన్నర్‌ డేటింగ్‌‌'లో 3 గంటలు ఆడుకున్నాం... పోర్న్ కంపెనీ పెట్టాం... సన్నీలియోన్

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ సన్నీ లియోన్. ఈమె మరో పోర్న్ స్టార్‌ డానియల్ వెబర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పోర్న్ ఇండస్ట్రీకి స్వస్తి చెప్పి.. బాలీవుడ్‌లో అడుగు పెట్టింది.

Advertiesment
Sunny Leone
, శుక్రవారం, 24 ఆగస్టు 2018 (13:13 IST)
పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ సన్నీ లియోన్. ఈమె మరో పోర్న్ స్టార్‌ డానియల్ వెబర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పోర్న్ ఇండస్ట్రీకి స్వస్తి చెప్పి.. బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఇక్కడ పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోనూ ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. అయితే, పోర్న్ స్టార్ అయిన తాను మరో పోర్న్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను సన్నీ లియోన్ తాజాగా వెల్లడించింది.
 
'పోర్న్ చిత్రాల్లో నటించినప్పటికీ తామిద్దరం ఒకరిని ఒకరం అర్థం చేసుకుని భార్య భర్తలుగా జీవిస్తున్నట్టు చెప్పారు. నా భర్త డానియల్ వెబర్ నన్ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. నాకు మాత్రం కాస్త సమయం పట్టింది అని తెలిపింది. ఆ తర్వాత ఈ మెయిల్ ద్వారా మాట్లాడుకున్నాం. నా ఫోన్ నంబర్ అతడికి ఇచ్చా. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ చేసి డిన్నర్ డేటింగ్‌కి పిలిచాడు. నేను ఆలస్యంగా వెళ్ళాను. అయినా కూడా వెబర్ ఓపికగా ఎదురుచూశాడు అని సన్నీలియోన్ వివరించింది. డిన్నర్ డేట్‌లో మూడు గంటలు ఆగకుండా మాట్లాడుకున్నాం. తమ సంప్రదాయాల గురించి, ఆలోచనల గురించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ సమయంలోనే డానియల్ వెబర్‌ని పూర్తిగా ఇష్టపడ్డానని సన్నీలియోన్ తెలిపింది.
 
అదేసమయంలో తాను మరో వ్యక్తితో పోర్న్ మూవీల్లో నటించడం డేనియల్‌కు ఇబ్బంది కలిగించే విషయమే. ఈ విషయం నాతో చెప్పకపోయినా చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవమన్నారు. అందుకే మేమిద్దరం కలిసి పోర్న్ చిత్రాలు చేయాలని నిర్ణయించుకుని సొంతంగా కంపెనీ పెట్టాం. అప్పటినుంచి మేమిద్దరం మాత్రమే పోర్న్ చిత్రాల్లో నటించినట్టు చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘాటు ఫోటోలతో ఫిల్మ్ మేకర్స్‌ను బుట్టలోపడేస్తున్న 'కంచె' భామ