Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డేటింగ్ చేసిమరీ కాబోయే భర్తను ఓకే చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్.. ఎవరు?

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్‌లో నటించింది మూడు నాలుగు చిత్రాలే అయినప్పటికీ మంచి గుర్తింపు మాత్రం దక్కించుకుంది. ముఖ్యంగా, ఆమె నటించిన 'ట్రిపుల్ ఎక్స్' మూవీలో ప్రియ

డేటింగ్ చేసిమరీ కాబోయే భర్తను ఓకే చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్.. ఎవరు?
, గురువారం, 23 ఆగస్టు 2018 (11:36 IST)
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్‌లో నటించింది మూడు నాలుగు చిత్రాలే అయినప్పటికీ మంచి గుర్తింపు మాత్రం దక్కించుకుంది. ముఖ్యంగా, ఆమె నటించిన 'ట్రిపుల్ ఎక్స్' మూవీలో ప్రియాంకా చోప్రా అందాలను ఆరబోసింది. దీంతో హాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు క్యూకట్టారు.
 
ఈ క్రమంలో అమెరికా సింగ్ నిక్ జోనస్‌తో ప్రియాంకాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లింది. అయితే, తనకు కాబోయే భర్త అన్ని విధాలుగా ఫిట్‌గా ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు నిక్ జోనస్‌తో డేటింగ్ చేసింది. ఈ డేటింగ్ కొన్నేళ్ళపాటు కొనసాగింది. పైగా, ప్రియాంకా కంటే నిక్ పదేళ్లు చిన్నవాడు కూడా. అయినప్పటికీ అతన్నే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. 
 
ఫలితంగా ఇటీవలే ముంబైలోని వారి నివాసంలో వారిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇపుడు వీరిద్దరూ పెళ్లి ఎక్కడ చేసుకుంటారన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రియాంక తమ వివాహాన్ని జోనస్‌కు ఎంతో ఇష్టమైన హవాయి ద్వీపంలో జరపాలని అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. నిక్ 25వ పుట్టినరోజు నాడే ఈ వివాహం జరుగుతుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ప్రియాంక తల్లి మాత్రం అవన్నీ ఒట్టి రూమర్లు మాత్రమేనని, పెళ్లి తేదీ, వేదికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెపుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిష్‌ పేరెత్తితే మండిపడుతున్న బాలీవుడ్ నటి.. ఎందుకంటే..