Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగుతున్న మూతలపర్వం : 150 సినిమా థియేటర్లు మూసివేత

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (12:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల మూతలపర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 125కు పైగా థియేటర్లు స్వచ్చంధంగా మూసివేశారు. అలాగే, అధికారులు తనిఖీల్లో సౌకర్యాలు లేవన్న సాకుతో మరికొన్ని థియేటర్లను సీజ్ చేశారు. తాజాగా మరో 30 థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. దీంతో ఏపీలో థియేటర్ల మూతలపర్వం కొనసాగుతోంది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 985 వరకు థియేటర్లు ఉన్నాయి. వీటిలో 125 థియేటర్లు స్వచ్చంధంగా మూసివేశారు. మరో 30 థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు 5 కిలోమీటర్ల దూరంలో దాదాపు 650కి పైగా సీటింగ్ కెపాసిటీ, అతిపెద్ద స్క్రీన్‌తో ఆసియాలోనే రెండో అతిపెద్ద థియేటర్‌గా ఉన్న వి-ఎపిక్‌ మల్టీప్లెక్స్‌ను కూడా మూసివేశారు. 
 
ఈ థియేటర్ ఉన్న ప్రాంతం సి గ్రేడ్ కింద అంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది. దీంతో ఈ థియేటర్‌లో కనిష్టంగా రూ.5 గరిష్టంగా రూ.30 ధరలతో సినిమా టిక్కెట్లను విక్రయించాల్సివుంది. ఈ ధరలకు సినిమా థియేటర్ నిర్వహణ అసాధ్యమని భావించిన నిర్వాహకులు థియేటర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 
 
అలాగే అనేక జిల్లాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు థియేటర్లు నడపడం సాధ్యంకాదని భావించిన యజమానులు స్వచ్చంధంగా తమ థియేటర్లను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. 
 
నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఇప్పటికే పలు చోట్ల థియేటర్లను సీజ్ చేశారు. కృష్ణా జిల్లాలో అధికారులు 12 థియేటర్లను మూసివేయగా, 18 హాళ్లను యజమానులు స్వచ్చంధంగా మూసివేయించారు. అలాగే, గుంటూరులో 70 థియేటర్లను అధికారులు తనిఖీ చేసి 35 హాళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. వీటిలో 15 థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments