Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాచారం లీక్ చేస్తున్నారంటూ ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురిపై వేటు

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తాఖీదు నోటీసులు జారీచేసింది. కాగ్ కూడా ఏపీ వైఖరిని తూర్పారబట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వీరిలో ఇద్దరు సెక్షన్‌ ఆఫీసర్లు, ఒక సహాయ కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
ఆర్థికశాఖలో సెక్షన్‌ అధికారులుగా పనిచేస్తున్న డి.శ్రీనుబాబు, కె.వరప్రసాద్‌, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖలోని సమాచారం లీక్‌ చేస్తున్నారనే అభియోగంపై ప్రభుత్వం వారిని సస్పెండ్‌ చేసింది. వేటు పడిన ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments