Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా..

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (18:25 IST)
ఏపీలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగనుంది. రాష్ట్ర ప్రజల నెంబర్ వన్ చాయిస్‌గా జగన్‌నే కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఈ విషయాన్ని ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ సర్వే వెల్లడించింది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ జగనే ప్రభంజనం సృష్టిస్తారని ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో మరోసారి వైసీపీ విజయం నల్లేరుమీద నడకేనని తేల్చింది. 
 
తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఆగస్టు ఎడిషన్ సర్వే రిపోర్టును ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ సర్వే నిర్వహించగా.. చాలా వరకు ఓటర్లు జగన్‌కే ఓటేశారు. మొదటి ప్రాధాన్యతగా ముఖ్యమంత్రి జగన్‌నే ఎంచుకున్నారు.
 
ఈ సర్వే ప్రకారం.. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 సీట్లు దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 126 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పేర్కొంది. 
 
ఇక మిగతా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభావం చూపనున్నాయంది. ఏపీలో జనసేన ప్రభావం బాగానే ఉన్నప్పటికీ.. సీట్లు గెలుపొందే విషయంలో మునుపటి పరిస్థితే ఉండొచ్చని అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments