Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు వర్షాలే వర్షాలు

Webdunia
బుధవారం, 12 జులై 2023 (15:38 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా, తెలంగాణాలో రాబోయే ఐదు రోజులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. 
 
ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో భారీ వర్షాలు పడతాయని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ నగరంలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
 
వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణాలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.
 
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధ, గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments