Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాతావరణ శాఖ జారీ చేసే రెడ్ - ఎల్లో - గ్రీన్ అలెర్ట్‌లు అంటే ఏంటి?

red alert
, మంగళవారం, 11 జులై 2023 (11:57 IST)
సాధారణంగా వాతావరణ శాఖ వర్షాకాలం లేదా తుఫానుల సమయంలో రెడ్, ఎల్లో, గ్రీన్ అలెర్టులు జారీ చేయడం మనం చూస్తుంటాం. అయితే, ఈ కలర్ అలెర్ట్‌లకు అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. తాజాగా ఉత్తరాదిపై జలఖడ్గం విరుచుకుపడింది. మంగళవారం ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో ఢిల్లీకి రెడ్ అలెర్ట్ జారీచేసింది. మరికొన్ని రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. 
 
ఐఎండీ జారీ చేసే కలర్ అలెర్ట్‌లు నాలుగు రకాలు.. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలించి రాబోయే ఐదు రోజుల్లో వర్షాలు లేదా తుఫాను ప్రభావాన్ని అంచనా వేసి, దాని తీవ్రత ఆధారంగా అధికారులు అలర్ట్ లు జారీ చేస్తారు. వర్ష సూచనలకు సంబంధించిన అలెర్టులకు విషయానికి వస్తే..
 
24 గంటల వ్యవధిలో..
64.5 మిల్లీమీటర్ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినపుడు గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారు. ఈ ఎలాంటి అప్రమత్తత అవసరం లేదని అర్థం.
64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ వర్షపాతానికి ఎల్లో అలర్ట్.. ఈ హెచ్చరిక జారీ అయితే అలర్ట్‌గా ఉండాలని సూచన
 
115.6 మిల్లీమీటర్ల నుంచి 204.5 మిల్లీ మీటర్ల వర్షపాతానికి ఆరెంజ్ అలర్ట్.. రవాణా వ్యవస్థ (రోడ్డు, రైలు, వాయు)పై వర్ష ప్రభావం ఉంటుందని అర్థం. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చనే సూచన ఈ అలర్ట్‌లో ఉంటుంది.
 
204.5 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనే అంచనా వేస్తే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందనేందుకు సూచన. ప్రమాద తీవ్రతను, ప్రజలు, అధికారులను అప్రమత్తం చేయడానికి, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వాతావరణ శాఖ ఈ అలర్ట్‌లు జారీ చేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాకు వర్ష సూచన : వాతావరణ శాఖ హెచ్చరిక