Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో అక్రమ మైనింగ్ ... 40 గ్రానైట్ బ్లాక్స్, యంత్రాల సీజ్

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (17:37 IST)
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్న ప్రాంతాలను రాష్ట్ర గనులు భూగర్భ శాఖ డైరెక్టర్ వి.జి.వెంకట్ రెడ్డి పరిశీలించారు. గురువారం గనుల శాఖ డిడి ప్రకాష్, ఎడి పి.వేణుగోపాల్ లతో కలిసి శాంతిపురం, ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ క్వారీయింగ్ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. 
 
 
అటవీశాఖ ఆధీనంలోని ఈ భూముల్లో అక్రమంగా కొందరు వ్యక్తులు మైనింగ్ చేస్తున్నారని, సమాచారం అందిన ప్రతిసారీ దాడులు నిర్వహించి, వాహనాలు, యంత్రాలు, గ్రానైట్ మెటీరియల్ ను స్వాధీనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా అధికారులు డిఎంజికి వివరించారు. తాజాగా శాంతిపురం, ముద్దనపల్లె ప్రాంతంలో గత అక్టోబర్ 25, 28, డిసెంబర్ 23వ తేదీన ఇదే ప్రాంతంలో అక్రమ మైనింగ్ పై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో  సర్వే నంబరు 104, 213 పరిధిలోని అటవీ భూముల్లో  భారీగా గ్రానైట్ బ్లాకులను సీజ్ చేశామని తెలిపారు. 
 
 
ఇదే ప్రాంతంలో మైనింగ్ అక్రమాలపై తాజాగా 4 బృందాలతో మహాచెక్ లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 40 గ్రానైట్ దిమ్మెలు, 06 కంప్రెషర్లను 02 హిటాచీ యంత్రాలను లను సీజ్ చేయడం జరిగిందని అధికారులు వివరించారు. ఈ ప్రాంతాలను పరిశీలించిన అనంతరం డిఎంజి వెంకటరెడ్డి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అటవీశాఖ పరిధిలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ పై ఆ శాఖ ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. డిఎఫ్ఓ కు లేఖ రాయడంతో పాటు ఇక్కడి పరిస్థితిని వివరించి అటవీ అధికారుల నిఘాను పెంచేలా చూడాలన్నారు. ఫారెస్టు యాక్ట్ 1980 ప్రకారం అక్రమార్కులపై కేసులు నమోదు అయ్యేలా చూడాలన్నారు.
 
 
ద్రావిడ విశ్వ విద్యాలయం పరిధిలోని భూముల్లో అక్రమ మైనింగ్ పై  గతంలో దాడులు చేసి 131 గ్రానైట్ బ్లాకులను సీజ్ చేయడం జరిగిందని అధికారులు డిఎంజికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ యూనివర్సిటీ లోని హరప్పా భవనం సమీపంలోని భూముల్లోకి ఎవరూ వెళ్ళకుండా గాడి కొట్టించి,  సెక్యూరిటీ గార్డ్ ను నియమించాలని, అనుమతి లేకుండా ఎవరినీ ఈ ప్రాంత పరిధిలోకి రాకుండా చూడమని యూనివర్సిటీ అధికారులను కోరాలని అధికారులను ఆదేశించారు. 
 
 
రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ను అరికట్టే చర్యల్లో భాగంగా గనుల శాఖ ఆద్వర్యంలో ఈ మధ్యకాలంలో సుమారు రూ.5 కోట్ల విలువైన 555 గ్రానైట్ బ్లాక్ లను సీజ్ చేసినట్లు డీఎంజి వెంకటరెడ్డి తెలిపారు. సీజ్ చేసిన ఖనిజాలను వేలంలో డిస్పోజ్ చేస్తామని వెల్లడించారు.  ఈ మేరకు ఆక్షన్ కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 
 

అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం సీరియస్ ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చెక్ పోస్ట్ వ్యవస్థ ను పటిష్టం చేశామని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇతర రాష్ట్రాలకు మినరల్స్ తరలించకుండా చెక్ పోస్ట్ ల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని అన్నారు. అక్రమ మైనింగ్ బాద్యులైన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడితే ఖఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, గనులశాఖ అధికారుల బృందాలతో మొబైల్ తనిఖీలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments