Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిమ్మల్ని నమ్ముకుని నా పరువు పోగొట్టుకున్నా... కుప్పంలో బాబు ఆక్రోశం

మిమ్మల్ని నమ్ముకుని నా పరువు పోగొట్టుకున్నా... కుప్పంలో బాబు ఆక్రోశం
విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (14:19 IST)
స్థానిక ఎన్నికల్లో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో దారుణ ఓటమి పాల‌యిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎమోష‌న్ అయ్యారు. తిరిగి త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని సెట్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. అందుకే అక్క‌డి టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు.
 
 
కుప్పం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయి, అస‌లేం జ‌ర‌గుతోందిక్క‌డ అని నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. కుప్పం టీడీపీ నాయకులకు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ కూడా ఇచ్చారు. మిమ్మల్ని నమ్ముకుని నా పరువు పోగొట్టుకున్నా... నేను వచ్చినప్పుడు షో చేస్తున్నారే తప్ప, మీరు ప్రజల్లో ఉండడం లేదు... మీ చేష్టలతో ప్రజలు మనకు దూరమవుతున్నారు... అని ఆక్రోశించారు.
 
 
కుప్పంలో తెలుగుదేశం పార్టీలోకి యువతను రాకుండా సీనియర్లు అడ్డుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 35 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా.. కొత్త మొహాలే కనపడడం లేదు... ఇక చాలు... వంద మంది ఓటర్లకు ఒక యూత్ పర్సన్ ని ఏర్పాటు చేస్తాం అని చంద్ర‌బాబు త‌న కొత్త పాల‌సీని చెప్పారు. త‌న ప్ర‌త్య‌ర్ధి సీఎం జ‌గ‌న్ గ్రామ వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ త‌ర‌హాలో త‌ను కూడా యూత్ ప‌ర్స‌న్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు బాబు ప్ర‌క‌టించారు.
 
 
అలాగే, కుప్పం రామకుప్పం దళిత సంఘాలపై పోలీసుల దాడి, అంబేద్కర్ విగ్రహం తొలగింపు,  ఉయ్యాల నరసింహారెడ్డి విగ్రహ స్థాపనపై దళిత సంఘాలు చంద్రబాబును కలవగా ఆయన సంఘీభావం వ్యక్తం చేశారు. దళిత సంఘాలు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్.. ఖమ్మం జైలుకు తరలింపు