Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (09:59 IST)
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం చెక్పోస్ట్ పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి భారీగా మద్యం సీసాలను, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. డియస్సీ  కార్యాలయంలో స్పెషల్ ఏన్ ఫోర్స్ మెంట్ అధికారి వకూల్ జిందాల్ ఆధ్వర్యంలో మీడియా ముందు హాజరు పరిచారు. 
 
తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తెస్తుండగా పెద్దాపురం వద్ద  వాహనాల తనిఖీల్లో రెండు బైక్ లను తనిఖీలు చేయగా వారి వద్ద నుండి 645 మద్యం సీసాలను పట్టుకున్నామని వకూల్ జిందాల్ తెలిపారు.

ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, వీరు ఇద్దరు ఇబ్రహీంపట్నం మం కేతనకోండ గ్రామానికి చెందిన వారుగా గుర్తించామని తెలిపారు. తెలంగాణ నుండి తక్కువ ధరకు మద్యం తీసుకుని వచ్చి ఆంధ్రలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. 
 
మద్యంను అక్రమ రవాణా చేసిన ఎంతటి వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందుతులను పట్టుకున్న పోలీసులను అభినందించి రివార్డులు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments