Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపి నాయ‌కులు ద‌ద్ద‌మ్మ‌లు: మంత్రి వెలంప‌ల్లి

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (09:51 IST)
ఐదు సంవ‌త్ప‌రాలుగా న‌గ‌రాన్ని అభివృద్ది చేయ‌కుండా విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది చంద్ర‌బాబు నాయుడు అని, జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత న‌గ‌ర అభివృద్దికి బాట‌లు ప‌డ్డాయ‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో స్వాతి సెంట‌ర్ వ‌ద్ద క్యాంబే రోడ్డు మ‌రియు  గాంధీ బొమ్మ సెంట‌ర్‌లో దాదాపు 4కోట్లు రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నుల‌కు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు శుంకుస్థాప‌న చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదు సంవ‌త్స‌రాలు జ‌లీల్ ఖాన్‌, బొండా ఉమా, గ‌ద్దె రామ్మెహ‌న‌రావు, ఎం.పి కేశినేని నాని విజ‌య‌వాడకు ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేని ద‌ద్ద‌మ్మ‌లు అన్నారు.

టిడిపి ప్ర‌భుత్వ‌ హ‌యంలో న‌గ‌ర అభివృద్ది ప‌ట్టించుకోని ఎం.పి.. ఇప్ప‌డు దుర్గ‌గుడి ఫ్లై ఓవర్ గురించి మాట్లాడ‌టం హ‌స్య‌స్ప‌దంగా ఉంద‌న్నారు.

కృష్ణా పుష్క‌రాల‌కు దుర్గ‌గుడి ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామ‌ని చెప్పిన ఎం.పి కేశినేని నాని ఇప్ప‌డు ప్ర‌జ‌ల‌కు ఏమి స‌మాధానం చేబుతార‌ని ప్ర‌శ్నించారు. 
 
4న దుర్గ‌గుడి పైవోర్‌తో పాటు బెంజిస‌ర్కిల్ పైవోర్‌, విజ‌య‌వాడ అవుట‌ర్ రింగ్ రోడ్డును కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ప్రారంభిస్తామ‌న్నారు. జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత సంక్షేమం, అభివృద్దిని రెండు క‌ళ్లుగా న‌గ‌ర‌ అభివృద్దికి నిధులు మంజూరు చేశారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments