Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం... భార్యను ముక్కలు ముక్కలుగా చేసి... ఆ తరువాత?(Video)

అక్రమ సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు ఓ భర్త. పోలీసులకు ఆధారాలకు దొరక్కుండా మృతదేహాన్ని ఛిద్రం చేసి తిరుపతిలోని మంగ

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (16:04 IST)
అక్రమ సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు ఓ భర్త. పోలీసులకు ఆధారాలకు దొరక్కుండా మృతదేహాన్ని ఛిద్రం చేసి తిరుపతిలోని మంగళం సమీపంలో పడేసి వెళ్ళిపోయాడు. సుమారు రెండు సంవత్సరాల పాటు పోలీసులు కేసును ఛేదించి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. 
 
నెల్లూరు జిల్లా కావలిలో చంద్రమౌళి, ఉమాదేవి భార్యాభర్తలు ఉన్నారు. వీరికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే పాప తనకు పుట్టలేదని, అక్రమ సంబంధం ద్వారానే పుట్టిందని అనుమానం పెంచుకున్న చంద్రమౌళి భార్యను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 2015 మార్చి 21వ తేదీన ఉమాదేవిని తిరుపతికి తీసుకొచ్చి మంగళం రోడ్డులో చంపి పడేసి వెళ్ళిపోయాడు. మృతురాలి ఆచూకీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు చంద్రమౌళి. 
 
అలాగే చిన్నపాపను కలకత్తా రైలులో వైజాగ్ వరకు తీసుకెళ్ళి వదిలి వచ్చేశాడు. ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో పోలీసులు రెండు సంవత్సరాలుగా కేసును దర్యాప్తు చేస్తూనే వున్నారు. అయితే తాజాగా కావలిలో ఒక మహిళ మిస్సింగ్ కేసు రావడంతో ఆ కేసును ఆధారంగా చేసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వెంటనే హత్యకు కారకుడైన నిందితులు చంద్రమౌళితో పాటు అతని స్నేహితులు మాలకొండయ్య, వెంకట రాజేష్‌ కుమార్‌ను తిరుపతిలోని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైలులో వదిలేసిన పాప ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments