Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు రోజులు జ్వరం వస్తే తక్షణం ఆసుపత్రిలో చేరండి: ఏపీ ప్రభుత్వం

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (18:47 IST)
నాలుగు రోజుల నుంచి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు, ఆక్సిజన్ శాతం 94 కంటే  తక్కువగా ఉంటే స్థానికంగా ఉన్న వాలంటీర్, కార్యదర్శిని సంప్రదించండని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. వైరస్బారినపడి ఆలస్యంగా చికిత్స కోసం రావడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని, నిర్లక్ష్యం వద్దని, కోవిడ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాలని తెలిపారు.
 
విజయవాడలో ని రాష్ట్ర రోడ్డు భవనాలు భవన సముదాయంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రోజుకు వెయ్యికు పైగా కేసులు నమోదు అవుతున్నా యన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు శిఖర స్థాయికి వెళ్ళడం జరుగుతున్నదన్నారు. తూర్పు, పశ్చిమ  గోదావరి, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయన్నారు.

నిన్నటి రోజు వరకు 2 లక్షల పైగా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయన్నారు. పరీక్షలు జరిపిన సంఖ్య ఆధారం పాజిటివిటీ రేటు 8.76 శాతంగా ఉందన్నారు. ఇప్పటికీ వైరస్ వ్యాప్తి కి 5 నెలలు గడిచి, ఆరో నెలలోకి అడుగు పెట్టిం దన్నారు. మే వరకు ఇది 1 శాతమే ఉందని అన్నారు. జూన్ మాసంలో 2.16 శాతం, జులై నెలకు 12.33 శాతం, ఆగస్టు నెలలో ఇప్పటివరకు ఆస్థాయి 16.24 శాతంగా ఉందన్నారు.

మొత్తం పరీక్షలు నిర్వహించిన వాటికి అనుసంధానంగా రాష్ట్రంలో సగటు 8.76 శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నా యన్నారు. అన్ లాక్ ప్రక్రియ అనంతరం ఈ సంఖ్య పెరిగిందన్నారు.  ప్రస్తుతం మొత్తంగా 1842 మరణాలు ఉన్నాయని, ఇవి  పాజిటివ్ కేసుల్లో 0.9 శాతం అన్నారు. కేంద్ర, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఆధారంగా ఒక  శాతం లోపు ఉంటే కేసులను బాగా నియంత్రిస్తున్నట్టేనన్నారు.

రాష్ట్రంలో బ్పరిస్థితి అడుపులోనే ఉందని, ఐనప్పటికీ ప్రజలు, ప్రభుత్వం తీవ్ర లక్షణాలు ఉన్న వారిపై దృష్టి పెట్టాల్సిఉందన్నారు.  4 రోజులుగా జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలాగే ఆక్సిజన్ శాతం 94 శాతం కంటే తక్కువ ఉంటే కోవిడ్ గా భావించి అటువంటి వారికి తక్షణమే ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని వైద్య అధికారులకు, జిల్లా కలెక్టర్ లకు స్పష్టం చేశామని జవహర్ రెడ్డి తెలిపారు. 
 
ప్రజల్లో స్వచ్ఛందంగా నియంత్రణ చర్యలు చేపట్టాలని, పై పేర్కొన్న లక్షణాలు ఉంటే వాలంటీర్ లకు, ఆరోగ్య కార్యకర్తలు కు తెలిపేలా సెల్ఫ్ రిపోర్టింగ్ పెరగాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు లక్షణాల ఉంటే స్వయంగా చెప్పాలని, అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే చికిత్స మొదలు పెడితే మరణాల శాతం తగ్గించ గలుగుతా మన్నారు.  ఆఖరి నిముషంలో రావడం వల్ల కొన్నిసార్లు ప్రాణాలు కాపాడలేని పరిస్థితి నెలకొందని కె..ఎస్. జవహర్ రెడ్డి అన్నారు.

వైరస్ ప్రబలే దశకు చేరుకుందని,  ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాన్నారు. కోవిడ్ వైరస్ సోకకుండా బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించడం, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తరచుగా చేతులు శుభ్రపరచడం చెయ్యాలన్నారు. వాటి వల్ల 90 శాతం కోవిడ్ వ్యాప్తి తగ్గించ గలుగుతామన్నారు.  భౌతిక దూరం, రక్షణ చర్యలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
 
వచ్చే ఆరు నెలలు ఎంతో కీలకం కావున తగిన  జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కోవిడ్ మరణాల సంఖ్య ను తగ్గించటమే లక్ష్యం గా పని జేస్తున్నామని ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కోసం 104 , 14410  టోల్ ప్రీ, జిల్లా లలో కూడా ఫోన్ నెంబర్ లు పై విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు.

కోవిడ్ సోకిన రోగులు ఆస్పత్రులలకు వచ్చిన తర్వాత కనీసం 6 రోజులపాటు రోగికి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుండి కాపాడవచ్చని కాని ఆసుపత్రికి వచ్చిన రెండు మూడు రోజుల్లో నే కొందరు చనపోతున్నారని అందులో భాగంగానే కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన క్లినికల్ ప్రోటోకాల్ పాటిస్తున్నామన్నారు. వైరస్ నియంత్రణ కోసం రోగికి రెమెదేశివర్ మందును కూడా అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసరం అయితే వెంటిలేటర్ పెడుతున్నామన్నారు.

ప్రతి మరణం లోను ఆడిట్ లో భాగంగా ఈ మూడు అంశాలను కూడా పర్యవేక్షణ చేస్తున్నామని, కేవలం వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతి చెందిన వాటిపై కూడా దృష్టి సారిస్తున్నామన్నారు. వ్యాధి లక్షణాలు ఎక్కువ అయ్యాక వొచ్చే వారిలో 2, 3 రోజులకు మరణాలు ఉన్నట్లు గమనించినట్లు ఆయన తెలిపారు. కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు వొస్తే   కూడా తక్షణమే పరిష్కారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

జిల్లాల వారీగా పరిశీలించి  వాటిని సంబంధించిన జిల్లా లకు తెలియ చేస్తున్న ట్లు జవహర్ రెడ్డి తెలిపారు.  104 టోల్ ఫ్రీ కు, 14410 టెలి మెడిసిన్ నంబర్ లను ఎవరైనా సంప్రదించవచ్చన్నారు. ప్రతి కోవిడ్ ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామని, అక్కడ రోగులకు అందిస్తున్న చికిత్స, ఆస్పత్రుల్లో పడకలు గురించి సమాచారాన్నీ ఇస్తున్నామన్నారు.

ఇందుకోసం ప్రత్యేక అధికారి అందుబాటులో ఉంటారని, ఆయా వివరాలు ఆరోగ్య శాఖ  వెబ్ సైట్ తో పాటు స్థానికంగా ను తెలియ చేస్తున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం క్షేత్ర స్థాయిలో వివిధ శాఖలు, సంస్థల మానవ వనరులను ఉపయోగించడం జరుగుతున్నదని  కె. ఎస్. జవహర్ రెడ్డి పేర్కొన్నారు. సెర్ప్ స్వయం సహాయక సంఘాల 83 లక్షల మంది కి ఇప్పటికే శిక్షణ తరగతులు  నిర్వహించామన్నారు. 

మెప్మా లోని 20 లక్షల సభ్యుల, లక్ష  మంది ఐసిడిఎస్ కార్యకర్తలు ద్వారా ఆరు లక్షల మంది గర్భిణీ, బాలింతలకు,  గ్రామీణ ఉపాధి హామీ వర్కర్లు ఇలా అందుబాటులో ఉన్న వారిలో అవగాహన పెంచామన్నారు. వేర్వేరు మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 138 ఆసుపత్రుల ద్వారా కోవిడ్ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వాటిలో 60 ప్రభుత్వ, 78 ప్రైవేటు ఆస్పత్రుల కోవిడ్ చికిత్స అందిస్తున్నా యన్నారు.

చికిత్స నిమిత్తం అవసరమైన పడకలు కూడా విస్తృతంగా పెంచామన్నారు. అడ్ హుక్ పద్దతిలో 20 వేల మంది నర్సులు, ఇతర వైద్య సిబ్బంది అయిన స్పెషలిస్ట్ డాక్టర్లు, నియమిస్తున్నాము. రాష్ట్రంలో ని 4 జిల్లాలలో  సీరో సర్విలెన్స్ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగిందని కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు నుంచి మొదలు పెట్టామని తెలిపారు.

ఆయా జిల్లాలో 3 వేల చొప్పున టెస్టులు చేయాలని, అ విధానంలో  ప్రజల్లో యాంటిబాడీస్ స్థాయి తనిఖీ  చేస్తున్నామని తెలిపారు.  ఢిల్లీ, ముంబైల్లో ఈ విధమైన ప్రక్రియ చేశారని ఢిల్లీలో 23.5 శాతం మందికి, ముంబాయి లో మురికివాడల్లో 53 శాతం మంది కి, పోష్ లోకాలిటీ లో 16 శాతం మందికి వైరస్  ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్లిందని అక్కడి సర్వేలు ద్వారా తెలిసిందన్నారు. రాష్ట్రంలో చేపట్టే సర్వే నివేదిక ల ఆధారంగా చికిత్స వ్యూహం మార్చుకోవచ్చని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments