Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఆయుర్వేద మందును ఆమోదిస్తే తిరుమల శ్రీవారి పాదాల చెంత నుంచి..: చెవిరెడ్డి

Webdunia
శనివారం, 22 మే 2021 (19:04 IST)
కరోనా మందు తయారీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంను టీటీడీ పాలకమండలి సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ఆయుర్వేద నిపుణులతో కలిసి సందర్శించారు.
 
♦️ కరోనా మందు తయారీ విధానం.. వినియోగించిన సహజ వన మూలికలు.. మందు ఏ విధంగా పనిచేస్తుంది.. అనే అంశాలపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు విచ్చేసిన టీటీడీ ఆయుర్వేద నిపుణులు.. 
 
♦️చెవిరెడ్డి నేతృత్వంలో నెల్లూరు విచ్చేసిన ఆయుర్వేద నిపుణుల బృందం ఆనందయ్య  నివాసం, కరోనా మందు తయారు చేసిన ప్రాంతాన్ని, వినియోగించిన సహజ వనమూలికలను పరిశీలించారు. శాంపిల్స్ ను సేకరించారు.
 
♦️అనంతరం చెవిరెడ్డి మీడియా తో మాట్లాడారు..
 
♦️కరోనా ఆయుర్వేద మందు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
♦️ కరోనా నుంచి కాపాడుతుందన్న నమ్మకం కలిగిస్తున్న నేపథ్యంలో..
టీటీడీ పాలకమండలి సభ్యుని హోదాలో కృష్ణ పట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీని పరిశీలించేందుకు వచ్చామన్నారు..
 
♦️ టీడీడీ ఆయుర్వేద విభాగంలో సీనియర్ ప్రొఫెసర్లు, సంబంధిత శాస్త్రవేత్తలు విచ్చేశారని అన్నారు.
 
♦️ టీటీడీ పరిధిలో అధునాతన ఆయుర్వేద ఫార్మా  ఉందన్నారు. 
 
♦️ఈ ఆయుర్వేద మందు నిజంగా ఆమోదయోగ్యమైతే భవిష్యత్తులో ప్రజలకు అందించేందుకు టీటీడీ ముందుంటుందని అన్నారు..
 
♦️ ఐసిఎంఆర్ అధ్యయనం నివేదిక సానుకూలంగా ఉంటే.. రాష్ట్ర ప్రజలకు శ్రీవారి పాదాల చెంత ఆయుర్వేద మందు పంపిణీకి ప్రయత్నం ప్రారంభిస్తామని వెల్లడించారు.
 
♦️ఐసిఎంఆర్ అధ్యయనం నివేదిక వచ్చే లోపు టీటీడీ ఆయుర్వేద నిపుణులు కూడా కరోనా మందు పనితీరును అధ్యయనం చేస్తారని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments