Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ ఆదేశిస్తే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వచ్చే 2019లో జరిగే ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. బుధవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో పాల

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (12:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వచ్చే 2019లో జరిగే ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. బుధవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... క్యాబినెట్‌లో చోటు అనేది ఊహాగానాలేనని, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. 
 
అలాగే ప్రపంచంలో తెలుగువారికి గౌరవం దక్కుతుందంటే ఎన్టీఆర్ వల్లేనని, ఎన్టీఆర్ జీవిత చరిత్రను మొత్తం ఫోటో ఎగ్జిబిషన్‌లో పెట్టామన్నారు. ఎవరి దగ్గరనైనా ఎన్టీఆర్ జ్ఞాపకాలు ఏమున్నా ఎన్టీఆర్ ట్రస్ట్‌కి అందించాలని ఆయన కోరారు. అంతేగాక అమరావతిలో ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటుచేస్తున్నామని, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతి సంవత్సరం కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామన్నారు.
 
ఇదిలావుండగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ శాసనమండలికి జరుగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్సీగా నారా లోకేష్ పోటీ చేస్తారనే వార్త ఇపుడు హల్‌చల్ చేస్తోంది. ఆయన ఎమ్మెల్యే కోటా కింద పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments