Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏరాసు అయ్యప్పరెడ్డి వద్దే జూనియర్‌గా చేసా : జస్టిస్ ఎన్వీ రమణ

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (14:49 IST)
తాను న్యాయవాద వృత్తిని చేపట్టిన తొలినాళ్లలో శ్రీశైలం ప్రాంతానికి చెందిన ఏరాసు అయ్యప్ప రెడ్డి వద్ద జూనియర్‌గా చేరినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నందుకు అయ్యప్పరెడ్డికి, ఆయన కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. 
 
జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శుక్రవారం శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి శ్రీశైలం ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వారం రోజులుగా తెలుగు గడ్డపై తిరుగుతూ తాను ఎంతో సంతోషాన్ని పొందుతున్నానని చెప్పారు. 
 
ముఖ్యంగా, కర్నూలు జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. ఈ జిల్లా నుంచే న్యాయవాద వృత్తిని ప్రారంభించి, అంచెలంచలుగా ఎదిగానని చెప్పారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి ఏడాది రెండు, మూడు సార్లు శ్రీశైలంకు వచ్చి స్వామిని, అమ్మవారిని దర్శించుకుంటున్నానని తెలిపారు. 
 
తాను శ్రీశైలంకు వస్తున్నానని చెప్పిన వెంటనే... అన్ని ఏర్పాట్లు చేసిన ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లికి, స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జస్టిస్ రమణ చెప్పారు.  

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments