Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ బాటలోనే వెళుతున్నా: ఎంపి రఘురామకృష్ణ రాజు

Webdunia
సోమవారం, 20 జులై 2020 (15:43 IST)
నర్సాపురం ఎంపి రఘురామకృష్ణరాజు తన స్పీడును పెంచారు. రామాలయానికి తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన ఎంపీ, ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, " మా పార్టీ  అధికారంలో ఉండగా నాకు రక్షణ లేకపోవడం దురదృష్టకరం.
 
 రాష్ట్ర ప్రభుత్వ భద్రతను నమ్మితే గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు అవుతుంది. రాజధాని ప్రజల ఉసురు, శాపాలు తగలకుండా సీఎం అమరావతిని “ఎగ్యూజిక్యూటివ్ రాజధాని”గా అయినా ప్రకటిస్తే బాగుంటుంది. అమరావతి రైతులను ప్రభుత్వం తడిగుడ్డతో గొంతుకోసింది.
 
కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని గత గురువారం ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశాను. రాష్ట్రప్రభుత్వ రక్షణ వద్దు. కేంద్ర ప్రభుత్వ రక్షణ మాత్రమే కావాలని పిటీషన్లో కోరాను. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను కలిసి రక్షణ విషయం ప్రస్తావిస్తాను. నియోజకవర్గంలో పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రక్షణ కోరాను.
 
నా సమస్య రాష్ట్రప్రభుత్వంతో కాబట్టే నాకు రాష్ట్ర ప్రభుత్వ రక్షణ వద్దు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నప్పుడు రాష్ట్ర పోలీసుల భద్రత మీద ప్రస్తుత మా ముఖ్యమంత్రి అనుమానం వ్యక్తం చేశారు. ఆయన బాటలోనే నేను కూడా వెళుతున్నాను. ఒక పార్లమెంట్ సభ్యుడిగా, రాజధాని ప్రజల సమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతాను."

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments