Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడు పాదాలు పట్టుకున్నట్టు...

వరుణ్
సోమవారం, 24 జూన్ 2024 (09:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని సినీనటుడు, జనసేన పార్టీ నేత హైపర్‌ ఆది అన్నారు. తాను ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి తాలూకా అని వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడారు. 
 
కూటమి అనే సినిమా 164 రోజులు ఆడిందని.. అందుకే ఈ సక్సెస్‌ మీట్‌ అని ఆది అన్నారు. కుమారుడు తన మొదటి సంపాదనతో తల్లికి చీర కొనిపెట్టినపుడు, బైక్‌పై తండ్రిని కూర్చోబెట్టి తీసుకెళ్లినపుడు ఎంత ఆనందం కలుగుతుందో.. పవన్‌కల్యాణ్‌ గెలిచినపుడు ప్రతి జనసైనికుడి కళ్లలో అది చూశానన్నారు. ముఖ్యంగా లంకా దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్లు.. ఎన్నికల్లో విజయం తర్వాత చిరంజీవి దగ్గరకి పవన్‌ అలా వెళ్లారన్నారు. అంతకంటే ఎమోషనల్‌ మూమెంట్‌ మరొకటి ఉండదని చెప్పారు. మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటారంటూ విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ ఈ దృశ్యం చెంపపెట్టువంటిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments