Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దమ్మ గుడిలో బలవంతంగా తాళి కట్టాడు... బెదిరించి కాపురం చేశాడు.. ఇపుడు...

Hyderabad
Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (09:46 IST)
హైదరాబాద్ నగరంలో ఓ యువతిని ఓ యువకుడు బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో మెడలో మూడు ముళ్లు వేశాడు. అప్పటి నుంచి బెదిరిస్తూ కాపురం చేస్తున్నాడు. అయితే, అతని వేధింపులు తాళలోని ఆ యువతి... పోలీసులను ఆశ్రయించడంతో ఈ బలవంతపు పెళ్లి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, అంబర్‌పేట్‌కు చెందిన అనిల్‌(24) అనే యువకుడు గత ఐదేళ్లుగా శ్రీకృష్ణానగర్‌కు చెందిన యువతి(19)ని ప్రేమిస్తున్నాడు. ఆర్నెల్ల క్రితం గుడికి వెళ్ళాలని అనిల్‌ ఆ యువతిని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడికి తీసుకెళ్ళాడు. 
 
అతను ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఓ చెట్టు కింద ఆమె మెడలో తాళికట్టాడు. మరొకరితో పెళ్ళికాకుండా చేశాడని తనతో రాకపోతే బతుకు ఆగమవుతుందంటూ ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆ యువకుడితో పాటు బాధిత యువతి అంబర్‌పేటకు వెళ్ళి కాపురం పెట్టింది. 
 
ఆర్నెల్లు గడవకముందే అనిల్‌ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ మానసికంగా వేధించసాగాడు. ఇటీవల మద్యం తాగి వచ్చి కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఆమె 10 రోజుల క్రితం తన తల్లి వద్దకు వచ్చింది. అయినాసరే రోజూ ఇంటికి వచ్చి బెదిరించసాగాడు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అనిల్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments