Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడిపై మోజు : గాఢనిద్రలో ఉన్న భర్తను ప్రియుడితో కొట్టి చంపించిన భార్య

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:53 IST)
మేనల్లుడిపై మోజుతో రైల్వే ఉద్యోగిగా ఉన్న భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈమె ఎస్.ఐగా కూడా ఎంపికైంది. అయినా కామదుర్బుద్ధితో కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. హైదరాబాద్ నగరంలోని బోరబండలో జరిగిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే..
 
రైల్వే క్వార్టర్స్‌లో నివసించే శ్రీనివాస్‌కు భార్య సంగీత ఉంది. ఈమెకు తమ ఇంట్లోనే ఉండే అల్లుడు విజయ్‌పై మోజు పడింది. ఫలితంగా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం బలపడింది. అయితే, తమ సంబంధాన్ని భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సంగీత... అల్లుడు విజయ్ సహకారంతో భర్తను చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పక్కన పడేసింది.
 
అయితే, శ్రీనివాస్ సోదరులు సురేష్, శంకర్‌లు వదిన సంగీతపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్లూస్ టీమ్‌తో రంగంలోకి దిగిన పోలీసులు, పోలీసు జాగిలాలు అసలు నిందితులను పట్టించాయి. 
 
సంగీతను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించింది. తన అల్లుడు విజయ్ సహకారంతో భర్తను చంపేసి మృతదేహాన్ని చాపలో చుట్టి బోరబండ రైల్వే ట్రాక్ పక్కన పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టుగా చెప్పింది. దీంతో సంగీతను, ఆమె అల్లుడు విజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, బీఈడీ చదివిన సంగీత ఇటీవల జరిగిన ఎస్.ఐ పరీక్షల్లో ఉత్తీర్ణురాలేంది. త్వరలో ఎస్.ఐ కాబోతోంది. 
 
రైల్వే ఉద్యోగి అయిన శ్రీనివాస్ అక్క కుమారుడు విజయ్... రెండేళ్ల నుంచి సంగీత ఇంట్లోనే ఉంటున్నాడు. అల్లుడు వరుస కావడంతో అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం శ్రీనివాస్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. పైగా, శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రోజు సాయంకాలం భార్యా భర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. 
 
అదే రోజు అర్థరాత్రి భర్తను చంపేయాలని నిర్ణయించుకున్న భార్య సంగీత, తన ప్రియుడు  విజయ్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించి హత్య చేసింది. మద్యం తాగి పడుకున్న శ్రీనివాస్ కాళ్లను భార్య సంగీత పట్టుకోవడంతో… మేనల్లుడు విజయ్ బండ రాయితో తలపై బలంగా కొట్టాడు. అక్కడికక్కడే శ్రీనివాస్ చనిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments