Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు ముగ్గురు భార్యలున్నా ఫర్లేదు.. నేను నాలుగో భార్యగా ఉంటా...

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉండేందుకు ఓ మహిళ సిద్ధమైంది. పవన్‌కు నాలుగో భార్యగా ఉండేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెపుతోంది.

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (11:37 IST)
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉండేందుకు ఓ మహిళ సిద్ధమైంది. పవన్‌కు నాలుగో భార్యగా ఉండేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెపుతోంది. ఆ మహిళ ప్రస్తుతం హైదరాబాద్ బేంగంపేట్‌లోని కొలంబస్ ఆసుపత్రిలోని సైకియాట్రిస్టు దగ్గర చికిత్స పొందుతోంది. 
 
దీనిపై సైకియాట్రిస్టు నరేష్ వడ్లమాని మాట్లాడుతూ, ఐదారేళ్ల క్రితం ఆ యువతి (24) ని ఆమె తల్లితండ్రులు చికిత్స కోసం తన దగ్గరకి తీసుకొచ్చారని తెలిపారు. ఆమె సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌‌కి వీరాభిమాని. అప్పట్లో పవన్ కల్యాణ్ ఆమె పని చేసే మల్టీనేషనల్ కంపెనీకి అనుకోకుండా వెళ్లడం, అక్కడ ఆ అమ్మాయిని చూసి నవ్వడం జరిగందట. దీంతో అప్పటినుంచి పవన్ కల్యాణ్ తనను ప్రేమిస్తున్నాడనే భ్రమలో ఆమె పడిపోయింది. 
 
పైగా, అప్పటి నుంచి వింతగా ప్రవర్తించడమేకాకుండా 'నేనే కాదు, పవన్‌ కల్యాణ్‌ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను వదిలేస్తే వాళ్లింటికి వెళ్తాను' అంటూ గోల చేయడం ఆరంభించింది. దీంతో ఆమెకు చికిత్స చేసేందుకు వైద్యునివద్దకు తీసుకెళ్లగా, ఆమెను పరీక్షించిన వైద్యులు ఎరొటొమేనియా వ్యాధితో బాధపడుతోందని నిర్ధారించారు. అపుడు చికిత్స చేయగా ఆమె కోలుకున్నారని చెప్పారు. 
 
అయితే, తీవ్రమైన ఒత్తిడికి గురైతే మాత్రం ఆ సమస్య మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించానని, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించామని తెలిపారు. తాము హెచ్చరించినట్టే ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాత వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్ని బ్యాలెన్స్‌ చేసే క్రమంలో ఒత్తిడికి లోనై మళ్లీ 'ఎరొటొమేనియా'కు లోనైంది.
 
ఇపుడు మళ్లీ తమవద్దకు ఆ మహిళను తీసుకునిరాగా, 'పవన్‌ కల్యాణ్‌‌కు ముగ్గురు భార్యలున్నా ఫర్వాలేదు నాలుగో భార్యగా ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు' అని ఆమె అంటోంది. అయితే ఇప్పుడు ఆమెకు మరోసారి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments