Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి వెళ్తే.. స్నేహితులతో కలిసి అత్యాచారం

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:32 IST)
తనను కలవాలంటూ తెలిసిన వ్యక్తి పిలిస్తే వెళ్లిన మహిళపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ దారుణం హైదరాబాద్‌ నగరంలో జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుపై సోమవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.
 
కొత్తపేట గ్రీన్‌హిల్స్‌ కాలనీలో నివాసముంటున్న సదరు మహిళ (32)కు ఐదేళ్ళ క్రితం పెళ్లి కాగా, భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో మన్సురాబాద్‌కు చెందిన సీసీ కెమెరాల వ్యాపారి మనోజ్‌కుమార్‌ (30)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. మనోజ్‌కుమార్‌ తన 5 మంది స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని సాహెబ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పార్టీ ఉందని ప్రియురాలిని పిలిపించారు. అక్కడికి వెళ్లిన ఆమెకి మనోజ్‌కుమార్, అతని స్నేహితులు బలవంతంగా మద్యం తాగించారు. 
 
అధిక మద్యం తాగిన మనోజ్‌కుమార్‌ ప్రియురాలు నిద్రమత్తులోకి జారుకుంది. ఇదే అదునునుగా భావించిన మనోజ్‌కుమార్, అతని స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన మహిళ తనకు జరిగిన అన్యాయంపై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments