Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళిపీటలపై వరుడు... మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడంటూ...

పెళ్లి పీటలపై వరుడు కూర్చొనివున్నాడు. మరికొన్ని నిమిషాల్లో వధువు మెడలో మూడు ముళ్లు వేయాల్సి వుంది. కానీ, అపుడే ఓ యువతి పెళ్లిమండపంలోకి పోలీసులతో ప్రత్యక్షమైంది. మాయమాటలు చెప్పి తనపై అత్యాచారం చేశాడంటూ

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (17:08 IST)
పెళ్లి పీటలపై వరుడు కూర్చొనివున్నాడు. మరికొన్ని నిమిషాల్లో వధువు మెడలో మూడు ముళ్లు వేయాల్సి వుంది. కానీ, అపుడే ఓ యువతి పెళ్లిమండపంలోకి పోలీసులతో ప్రత్యక్షమైంది. మాయమాటలు చెప్పి తనపై అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు చేసింది. అంతేనా వరుడుపై లైంగికదాడి కేసు కూడా పెట్టింది. దీంతో అప్పటివరకు కళకళలాడిన పెళ్ళి మండపం ఒక్కసారిగా బోసిబోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతి హెరిటేజ్ సూపర్ మార్కెట్లో పనిచేస్తూ, ఇందిరా నగర్‌లో నివసిస్తోంది. ఈమెకు నరేష్ అనే యువకుడితో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆపై ఇద్దరూ కలసి ఒకే గదిలో సహజీవనం చేశారు. పెళ్లిని దాటవేస్తూ వచ్చిన నరేష్, ఓ మారు అమెకు అబార్షన్ కూడా చేయించాడు.
 
ఈ క్రమంలో ఇటీవల నరేష్ ఫోన్‌లో ఓ యువతి ఫొటో ఆమెకు కనిపించింది. ఎవరని నిలదీయగా, తన సోదరి అని అబద్ధమాడాడు. అనుమానం వీడక ఆమె ఆరాతీసింది. ఇందులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 30వ తేదీ, గురువారం రోజున వారిద్దరికీ కరీంనగర్‌లో వివాహం జరగనుందని తెలిసింది. 
 
అంతే... ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. తక్షణం ఎక్స్‌ప్రెస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, పెళ్లి జరిగే కల్యాణ మండపానికి వెళ్లారు. పెళ్లిని నిలిపివేయించి, నరేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments