Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ సెంటర్‌లో యువతి.. స్టేషన్‌కు తీసుకెళ్లి కోర్కె తీర్చుకున్న ఎస్ఐ

మసాజ్ సెంటర్‌లో పట్టుబడిన ఓ యువతిని టాస్క్ ఫోర్స్‌ విభాగంలో పని చేసే ఎస్ఐ ఒకరు తన గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ దారుణం జరిగినట్టు వార

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (17:38 IST)
మసాజ్ సెంటర్‌లో పట్టుబడిన ఓ యువతిని టాస్క్ ఫోర్స్‌ విభాగంలో పని చేసే ఎస్ఐ ఒకరు తన గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ దారుణం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో స్టూడియో మేకర్స్ స్పా పేరుతో ఓ మసాజ్ సెంటర్‌ ఉంది. ఇక్కడ మసాజ్ ముసుగులో వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పా సెంటర్‌లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అపుడు అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారంటూ ముగ్గురు యువతులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 
 
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన తర్వాత టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ఐ, యువతిని గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారట. బయటకు వచ్చిన తర్వాత ఆ యువతి ఎస్ఐపై ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మొత్తంమీద స్టేషన్‌లోనే ఎస్ఐ ఈ తరహా చర్యలకు పాల్పడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments