Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ : ఆడియో టేపుల్లో నారాయణ కాలేజీ అరాచకాలు

ఏపీ మంత్రి పి. నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల ఆడియో టేప్ ఇపుడు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు ఉద్యోగులు మాట్లాడుకున్న అంశాలు వివాదస్పదమయ్యాయి.

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (11:03 IST)
ఏపీ మంత్రి పి. నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల ఆడియో టేప్ ఇపుడు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు ఉద్యోగులు మాట్లాడుకున్న అంశాలు వివాదస్పదమయ్యాయి. డీమానిటైజేషన్ తర్వాత నోట్ల మార్పిడి, ఉద్యోగుల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మహిళ ఉద్యోగులపై లైంగికవేధింపులపై మాట్లాడుకున్నారు. ఈ ఆడియో లీక్ కావడంతో విద్యార్థి సంఘలు మండిపడుతున్నాయి. 
 
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆడియో టేపు బయట పెట్టాడన్న అనుమానంతో వైస్ ప్రిన్సిపల్ నవీన్‌పై నారాయణ సిబ్బంది దాడి చేశారు. దీనిపై బాధితుడు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడియో టేపుతో తనకు సంబంధం లేదని చెప్పినా.. తనపై దాడి చేసినట్లు పేర్కొన్నాడు. పైగా, ఏపీ మంత్రి నారాయణ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 
 
మరోవైపు మహిళా టీచర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా నారాయణగూడలోని నారాయణ కాలేజ్ దగ్గర ఆందోళన చేశారు ఏబీవీపీ కార్యకర్తలు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. నారాయణ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం