Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక సుఖం కోరిన మామ.. ఆత్మహత్య చేసుకున్న కోడలు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (13:32 IST)
తనకు పడక సుఖం ఇవ్వాల్సిందేనంటూ కోడలిని మామ పదేపదే వేధించాడు. అతని వేధింపులు భరించలేని ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘట హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బషీర్‌బాగ్‌లోని పూల్‌బాగ్‌కు చెందిన మహిళ (25) ఏడాదిన్నర క్రితం గాంధీనగర్‌కు చెందిన రమేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఏడు నెలల కుమార్తె ఉంది. రమేశ్ తండ్రి వెంకటేశ్ (50)కు కోడలిపై మనసుపడింది. దీంతో లైంగిక కోర్కె తీర్చాలంటూ వేధించసాగాడు. ఈ విషయం భర్త దృష్టికి కూడా తీసుకెళ్లింది. అతను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పాటు.. మామ వేధింపులు మరింతగా ఎక్కువయ్యాయి. 
 
ఈ పరిస్థితుల్లో భర్త రమేష్ తన భార్య, కుమార్తెను తీసుకుని జేఎన్ఎన్‌యూఆర్ఎం గృహ సముదాయంలో ఉంటున్న అత్తవారింట్లో వదిలిపెట్టాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బాధిత మహిళ అదే అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో నివసిస్తున్న అన్న ఇంటికి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో చూసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు తలుపులు గడియపెట్టి ఉండడం గమనించారు. 
 
తట్టినా తీయకపోవడంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. ఓ గదిలో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రమేశ్ తండ్రి వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం