Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించాక కొత్తిమీర రసం తాగితే...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (14:45 IST)
మద్యంబాబులు సరికొత్త ఎత్తుగడ వేశారు. పీకల వరకు మద్యం సేవించినా బ్రీత్ ఎనలైజర్‌కు చిక్కకుండా ఉండేందుకు వీలుగా సరికొత్త టెక్నిక్ అనుసరిస్తున్నారు. ముఖ్యంగా, మద్యం సేవించిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిమ్మరసం లేదా కొత్తిమీర రసం తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల బ్రీత్ ఎనలైజర్‌కు చిక్కరని గట్టిగా భావిస్తున్నారు. 
 
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. దీంతో పోలీసులు రోడ్లపై కనిపిస్తే చాలు... మరో మార్గం గుండా తమ వాహనాలతో ఉడాయిస్తున్నారు. 
 
వాస్తవానికి గతంలో పోలీసులు చెకింగ్ చేస్తున్నారని కనిపిస్తే, మరో మార్గం గుండా తమ వాహనాలతో ఉడాయిస్తుంటారు. మరికొంత మంది మాత్రం మద్యం సేవించిన తర్వాత నిమ్మరసం లేదా కొత్తిమీర రసం సేవిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బ్రీత్ ఎనలైజర్‌కు చిక్కరన్నది వారి నమ్మకం. ఆ నమ్మకంతో పోలీసుల ముందుకు వెళ్లి, అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ కారణంతోనే మే నెలలో అత్యధికులు పట్టుబడినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ జ్యూస్‌లతో మద్యం తాగినట్టు వాసన రాకపోవచ్చుగానీ, 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 గ్రాములకు మించిన ఆల్కహాల్ ఉంటే పట్టేస్తామని పోలీసులు అంటున్నారు. మందు కొట్టిన తర్వాత ఏ జ్యూస్ తాగినా, పాన్, పాన్ మసాలాలు నమిలినా అది శ్వాస పరీక్షను ప్రభావితం చేయబోదని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments