హైదరాబాద్ నగరంలో ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. రాత్రి పబ్‌కెళ్లి ఇంటికొచ్చిన ఆమె ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్ నగరంలో ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. రాత్రి పబ్‌కెళ్లి ఇంటికొచ్చిన ఆమె ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ లంగర్‌హౌజ్‌కు చెందిన ఉజ్వల్, మనస్థలిపురంకు చెందిన రేఖ(30)లు పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా చందానగర్‌లోని అపర్ణ గార్డెనియా ప్లాట్ నెంబర్ 801ఏలో నివశిస్తున్నారు.
అయితే, దంపతులిద్దరూ గచ్చిబౌలిలోని ఐబీఎం సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. రేఖ కుటుంబ బాధ్యతలను పట్టించుకోదని, ఇతరులతో ఫోన్లు మాట్లాడటం తనకు నచ్చదని ఉజ్వల్ ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. కాగా, రాత్రి దంపతులిద్దరు గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లారు. ఇంటికి వచ్చాక గొడవపడి వేర్వేరు గదుల్లో పడుకున్నారు. ఉదయం ఉజ్వల్ లేచి చూసే సరికి రేఖ ఫ్యానుకు చీరతో వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు.
అయితే, రేఖ మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రేఖ అత్మహత్య చేసుకుందా? లేక భార్యపైన కోపంతో భర్త ఉజ్వలే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.