Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తపై అత్యాచారం.. నిలదీసిన భార్య... విడాకులిస్తానంటూ భర్త బెదిరింపు

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (11:42 IST)
ఓ కామాంధుడు తాగిన మైకంలో అత్తపై (భార్య తల్లి) అత్యాచారం చేశాడు. మత్తు దిగిన తర్వాత భర్తను భార్య నిలదీసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ కామాంధుడు.. విడాకులిస్తేస్తానంటూ భార్యను బెదిరిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన ఓ మహిళ నగరంలోని ఆసిఫ్ నగర్‌లో ఉండేది. ఇక్కడే ఆమె కుమార్తె కుమార్తె, అల్లుడు హార్ధిక్ గాంధీ, మనవడు ఉంటోంది. అయితే, మనవడి ఆలనాపాలనా ఆ మహిళే చూసుకుంటూ వస్తోంది.
 
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతూ వచ్చిన ఆమె... నవంబరు 13వ తేదీన నిద్రమాత్రలు వేసుకుని పడుకుంది. ఆరోజు అర్థరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన హార్ధిక్ ఆమె గదిలోకి వెళ్లి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
మరుసటి రోజు తన కుమార్తెకు జరిగిన విషయాన్ని చెప్పి బోరున విలపించింది. దీంతో, అప్పటికే ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్తకు భార్య ఫోన్ చేసింది. ఇంటికి పిలిచి నిలదీసింది. క్షణికావేశంలో అలా చేశానని, తనను క్షమించాలని ఈ సందర్భంగా హార్ధిక్ కోరాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. 
 
అనంతరం భార్య మరోసారి ఫోన్ చేయగా... ఇంటి నుంచి తాను వెళ్లిపోతున్నానని, నీకు విడాకులు ఇస్తానని, ప్రతి నెల భరణం ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను స్పందించలేదు. దీంతో, బాధితురాలు, ఆమె కుమార్తె జరిగిన ఘటనపై శుక్రవారం రాత్రి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం