Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కా ఆధారాలున్నాయ్... అందుకే గజల్ శ్రీనివాస్ అరెస్ట్

'గజల్' కళాకారుడు గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేయడానికిగల కారణాలను హైదరాబాద్ పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ స్పష్టంచేశారు. ఆలయవాణి అనే వెబ్ రేడియోలో జాకీగా పనిచేస్తోన్న కుమారి అనే యువతి ఇచ్చిన ఫిర్యాదుతో

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (15:05 IST)
'గజల్' కళాకారుడు గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేయడానికిగల కారణాలను హైదరాబాద్ పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ స్పష్టంచేశారు. ఆలయవాణి అనే వెబ్ రేడియోలో జాకీగా పనిచేస్తోన్న కుమారి అనే యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనను అరెస్టు చేసినట్టు తెలిపారు. 
 
"సేవ్ టెంపుల్ అనే ఆర్గనైజేషన్‌కు 'గజల్' శ్రీనివాస్ ప్రచారకర్తగా ఉన్నాడు. పంజాగుట్ట వెంకట రమణ కాలనీలో ఆ ఆఫీస్ ఉంది. ఆ ఆర్గనైజేషన్‌కు అనుబంధంగా గజల్ శ్రీనివాస్ ఆలయవాణి అనే వెబ్ రేడియోను నడిపిస్తున్నాడు. అందులో జాకీగా ఓ యువతి పనిచేస్తోంది.
 
ఆమె అంతకుముందు బాలవాణీ అనే రేడియోలో పనిచేసింది. రెండు నెలల నుంచి ఆమెను గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. అన్ని ఆధారాలు ఉండడంతోనే అరెస్టు చేశాం. చాలా తీవ్రమైన కేసుగా పరిగణించవచ్చు. బాధితురాలి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులకు గురిచేశాడు అని పోలీసులు వ్యాఖ్యానించారు.
 
గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆధారాలతో సహా డిసెంబర్ చివరి వారంలో తమకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వేధింపులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఆలయవాణి వెబ్ రేడియో ఆఫీసులోనే కుమారిపై శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
 
బాధితురాలి ఫిర్యాదు తర్వాత ఆలయవాణి వెబ్ రేడియో ఆఫీసులో కూడా కొంతమంది ఉద్యోగులను విచారించామని తెలిపారు. అనంతరం పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్‌ను మంగళవారం అరెస్టు చేశామని ఏసీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. గజల్ శ్రీనివాస్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. గజల్‌పై 354, 354ఏ, 509 సెక్షన్ ఐపీసీ కింద కేసులు నమోదు చేశామని ఏసీపీ విజయ్‌కుమార్ స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం