Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాబా మీదకు వెళ్లి నాట్యం చేద్దాం రా!.... 13 యేళ్ల బాలికకు 60 యేళ్ళ పూజారి వల

పవిత్రమైన వృత్తిలో ఉన్నప్పటికీ అతనికి పాడుబుద్ధి పోలేదు. ఫలితంగా ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఆయన పేరు లాల్ చంద్ర శర్మ. వయసు 60 యేళ్లు. ఓ ఆలయంలో పూజారి. ఊరు ఇండోర్. ఈ వృద్ధుడు 13 యేళ్ళ బాలికపై ఆశ

Advertiesment
డాబా మీదకు వెళ్లి నాట్యం చేద్దాం రా!.... 13 యేళ్ల బాలికకు 60 యేళ్ళ పూజారి వల
, ఆదివారం, 24 డిశెంబరు 2017 (12:35 IST)
పవిత్రమైన వృత్తిలో ఉన్నప్పటికీ అతనికి పాడుబుద్ధి పోలేదు. ఫలితంగా ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఆయన పేరు లాల్ చంద్ర శర్మ. వయసు 60 యేళ్లు. ఓ ఆలయంలో పూజారి. ఊరు ఇండోర్. ఈ వృద్ధుడు 13 యేళ్ళ బాలికపై ఆశపడ్డాడు. డాబా మీదకు వెళ్లి నాట్యం చేద్దాం రా అంటూ అసభ్యకర వాట్సాప్ సందేశాలు పంపించి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వేధింపుల కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోర్, సింధీ కాలనీకి చెందిన లాల్‌చంద్ర శర్మ (60) స్థానికంగా ఉండే ఓ ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. అతని కుమార్తె దగ్గరకు హీరానగర్‌కు చెందిన ఓ బాలిక నృత్యం నేర్చుకునేందుకు ప్రతి రోజూ వచ్చేది. ఈ సమయంలో ఆయన కూడా అక్కడే కూర్చునేవాడు. 
 
ఆ బాలికతో మాటలు కలిపి మొబైల్ నెంబర్ తీసుకున్న శర్మ... బాలికకు తరచూ అశ్లీల వాట్సప్ మెసేజ్‌లు పంపిస్తుండేవాడు. తమ ఇంటి డాబా మీదకు వెళ్లి మాట్లాడుకుందామని, నృత్యం చేద్దామంటూ ఓ సందేశం పంపాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తల్లి దృష్టికి తీసుకెళ్లింది. 
 
ఆమె ‘కేర్ ఆఫ్ యూ’ సెల్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే సెల్ అధికారులు సదరు పూజారిని అదుపులోకి తీసుకుని, ఇండోర్ పోలీసులకు అప్పగించారు. కాగా పోలీసులకు పట్టబడటంతో సదరు పూజారి తన ఫోనులోని వాట్సప్ మెసేజ్‌లను తొలగించి, ఫోనును దాచేశాడు. 
 
అయితే పోలీసులు ఆ ఫోనును స్వాధీనం చేసుకుని బ్యాకప్ రాబట్టారు. అతను చేసిన అసభ్య మెసేజ్‌లన్నీ బయటపడ్డాయి. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#RKNagarElectionResult : 5వ రౌండ్ పూర్తి... దినకరన్ ఆధిక్యం