Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో క్వార్టర్ మందేసి బండెక్కి డ్రైవ్ చేయొచ్చు? ఎందుకని?

హైదరాబాబాద్‌లో ఇకపై క్వార్టర్ బాటిల్ మందుకొట్టి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడినా ఎలాంటి కేసులు నమోదు చేయరు. అయితే, బీఏసీ మోతాదు మాత్రం మించితే మాత్రం శిక్ష అనుభవించాల్స

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (11:24 IST)
హైదరాబాబాద్‌లో ఇకపై క్వార్టర్ బాటిల్ మందుకొట్టి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడినా ఎలాంటి కేసులు నమోదు చేయరు. అయితే, బీఏసీ మోతాదు మాత్రం మించితే మాత్రం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ తరహా నిర్ణయం తీసుకోవాలని భావించడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. 
 
సాధారణంగా 100 ఎంఎల్ బ్లడ్‌లో 30 ఎంజీ బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) ఉంటే పట్టుకుంటూ, వారి వాహనాలను స్పాట్‌లో సీజ్ చేయడంతో పాటు, కౌన్సెలింగ్ చేస్తారు. ఇలా పట్టుబడినవారు ఇంటికెళ్లి మరుసటి రోజు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే సమయంలో వివాహితుడైతే భార్యను, పెళ్లికాకుంటే తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా దగ్గరి బంధువును విధిగా తీసుకుని రావాల్సి ఉంటుంది. అపుడే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి వాహనాలను తిరిగి అప్పగిస్తుంటారు. 
 
అయితే, చాలా మంది మందుబాబులు కౌన్సిలింగ్‌కు హాజరుకాకుండా వాహనాలను వదిలేసుకుంటున్నారు. పైగా, కౌన్సెలింగ్‌ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ కారణంగానే ఆయా స్టేషన్‌లలో వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఇపుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇలా ఉన్న వాహనాల సంఖ్య 3,760కి పైగా ఉంది. దీంతో బీఏసీ కౌంట్‌ను 100కు సవరించి, అంతకన్నా ఎక్కువ మోతాదులో మద్యం తాగి దొరికితేనే వారికి కౌన్సెలింగ్ వర్తింపజేసే ఆలోచనలో ఉంది. 
 
దీనిపై హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ స్పందిస్తూ.. డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కి, కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. దీంతో అలాంటి వాహనాలన్నీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. వాటి సంరక్షణ భారం పోలీసు విభాగానికి తలనొప్పిగా మారింది. ఇందుకోసం కొత్త విధానాన్ని రూపొందించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇపుడు 60 ఎంఎల్ మద్యం సేవిస్తే శరీరంలో 30 బీఏసీ నమోదవుతుంది. ఆపై ఓ అర్థగంట ఎక్కడైనా గడిపి వాహనం నడుపుతూ వెళ్లి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికినా, ఆ పాటికి బీఏసీ తగ్గిపోతుంది. ఇక 30 బీఏసీ కౌంట్‌ను 100కు సవరిస్తే, నిరభ్యంతరంగా ఓ క్వార్టర్ మందేసి బండెక్కి డ్రైవ్ చేసుకుంటూ మందుబాబులు వెళ్లిపోవచ్చని పలువురుని వైద్య నిపుణులు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments