Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు కట్నం కోసం భార్యనే కిడ్నాప్ చేసిన ప్రబుద్ధుడు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (22:27 IST)
ఆధునికత మారినా.. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నా.. లోకం తీరు మారిపోతున్నా.. మనిషి బుద్ధిలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కట్నం కోసం వేధించడం, మహిళలపై అకృత్యాలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా అదనపు కట్నం కోసం ఓ భర్త భార్యనే కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన ఎక్కడో కాదు.. హైదరాబాదులోనే చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మాసబ్ ట్యాంకు ప్రాంతానికి చెందిన మహ్మద్ షరీఫ్ (74) అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు చేసిన షరీఫ్... తన ఆస్తులు ఇద్దరు కుమార్తెలకు చెందుతాయని పెళ్లి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
 
2014లో రెండో కుమార్తె అస్మాను సల్మాన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొంత కాలం భార్యతో బాగానే గడిపిన సల్మాన్... ఆ తర్వాత అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పిల్లలతో కలిసి తండ్రి వద్దకు వచ్చింది.
 
ఇలా తండ్రితో కలిసి ఆస్పత్రికి వెళ్తుండగా భార్యనే భర్త సల్మాన్ కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో కూతురును కాపాడేందుకు యత్నించిన షరీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షరీఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments