Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తులో గదికి వచ్చి మోడల్‌పై బాలుడు అత్యాచారం .. వీడియో తీసిన ఫ్రెండ్

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (10:10 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ మోడల్ అత్యాచారానికి గురైంది. గంజాయి మంత్తులో గదిలోకి వచ్చిన బాలుడు... పడుకునివున్న మోడల్‌పై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఆ బాలుడి స్నేహితు వీడియో తీశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 21 యేళ్ళ ఓ యువతి మోడల్ కావాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ నగరానికి వచ్చి అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడ సమీపంలో ఓ హాస్టల్‌లో ఉంటూ వస్తూ అవకాశాల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో హాస్టల్ యజమాని కుమారుడి (17)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. నాలుగు నెలల క్రితం యువతి సోదరి కూడా రావడంతో హాస్టల్ ఖాళీ చేసి జూబ్లీహిల్స్ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో గత నెల 28న తన స్నేహితుడు నిఖిల్ రెడ్డి (19)తో కలిసి యువతి గదికి వచ్చిన హాస్టల్ యజమాని కుమారుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిఖిల్ రెడ్డి వీడియో చిత్రీకరించాడు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి వెళ్లిపోయాడు. 
 
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు కేసు పెట్టాలని చెప్పడంతో తిరిగి నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గంజాయి మత్తులో తన గదికి వచ్చిన బాలుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments